బాలీవుడ్‌లో స్ట్రెయిట్ సినిమాలు ఎన్ని వస్తున్నాయో, రీమేక్ చిత్రాలూ అన్ని వస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ.. భాష ఏదైనా కాన్సెప్ట్ నచ్చితే చాలు, హిందీలో తీయాల్సిందే అన్నంత పట్టుదలగా ఉన్నారు బీటౌన్ ఫిల్మ్ మేకర్స్. హీరోలు కూడా అంతగా ఇబ్బంది పెట్టకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇవాళ అజయ్ దేవగన్ కూడా 'దృశ్యం 2' రీమేక్‌ని పట్టాలెక్కించాడు.
మోహన్‌లాల్ నటించిన 'దృశ్యం' సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అన్ని భాషల్లోకీ రీమేక్ అయ్యి, ప్రతి చోటా విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేసింది.
ఓటీటీలో విడుదలైనా విజయ ఢంకా మోగించింది. దాంతో రీమేక్ సన్నాహాలు మళ్లీ మొదలయ్యాయి. ఆల్రెడీ వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ అయ్యింది. ఇప్పుడు హిందీలోనూ రూపొందుతోంది.
మొదటి పార్ట్‌లో నటించిన అజయ్ దేవగన్, శ్రియలే సెకెండ్ పార్ట్‌లోనూ లీడ్ రోల్ చేస్తున్నారు. టబు కీలక పాత్రలో కనిపించనుంది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన నిశికాంత్ కామత్ పోయినేడు కన్నుమూయడంతో ఆ బాధ్యతను అభిషేక్ పాఠక్‌కి అప్పగించారు. నిన్న ముంబైలో షూటింగ్ మొదలయ్యింది. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ సంవత్సరమే రిలీజ్ చేసే ప్లాన్స్‌లో ఉన్నారు.
అయితే తమిళంలో మాత్రం సీక్వెల్ సందడి ఎక్కడా కనిపించడం లేదు. మొదటి పార్ట్ 'పాపనాశం'లో యాక్ట్ చేసిన కమల్ రెండో పార్ట్‌లో చేయడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
ఆయన రెడీ అనగానే సెట్స్‌కి వెళ్లడం ఖాయమని నటి, దర్శకురాలు శ్రీప్రియ ఆమధ్య అన్నారు. 'దృశ్యం' తెలుగు వెర్షన్‌ని ఈవిడే డైరెక్ట్ చేశారు. సీక్వెల్‌ని మాత్రం ఒరిజినల్ తీసిన జీతూ జోసెఫ్ తెరకెక్కించాడు. దాంతో తమిళ సీక్వెల్ తీసే చాన్స్ శ్రీప్రియకి దక్కింది.