అమ్మాయిలిద్దరూ హీటెక్కించేస్తున్నారుగా..

Update: 2016-03-26 11:30 GMT
ఈడోరకం ఆడోరకం.. టైటిల్ తో బాగానే కొట్టాడు జి.నాగేశ్వరరెడ్డి. మంచు విష్ణు-రాజ్ తరుణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిన్న సైజు మల్టీస్టారర్ మూవీ ఇది. ఓ పంజాబీ సినిమాకు రీమేక్ గా వస్తోంది. ఈ సినిమా మొదలైనపుడు జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజవ్వగానే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ రోజు ఆడియో ఫంక్షన్ జరగబోతున్న నేపథ్యంలో రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లు జనాల ఆసక్తి మరింత పెంచుతున్నాయి. ఈ పోస్టర్లు వదిలినప్పటి నుంచి ట్విట్టర్ లో హైదరాబాద్ వరకు టాప్ లెవెల్లో ట్రెండ్ అవడం విశేషం. పోస్టర్లు చాలా కలర్ ఫుల్ గా.. హాట్ హాట్ గా ఉండటమే దీనికి కారణం.

ఇప్పటిదాకా ఈ సినిమాలో హీరోయిన్లెవరన్నది జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఐతే ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్లలో హీరోయిన్లు సోనారికా బడోరియా-హెబ్బా పటేల్ హాట్ హాట్ గా కనిపించి హీటు పుట్టించేస్తన్నారు. సినిమాలో మంచు విష్ణుకు జోడీగా సోనారికా నటిస్తుంటే.. రాజ్ తరుణ్ సరసన హెబ్బా చేస్తోంది. ఐతే ఓ పోస్టర్లో సోనారికా నడుం వైపు ఆశగా చెయ్యి వెయ్యబోతుంటే విష్ణు షాకై చూస్తున్నాడు. మరో పక్క హెబ్బా ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో రెచ్చగొట్టేలా పక్కన పోజిస్తోంది. ఈ పోస్టర్ జనాల్లో భలే క్యూరియాసిటీ పెంచుతోంది. ఇలాంటి మరికొన్ని పోస్టర్లు వదిలారు. ఈ రోజు రాత్రి మోహన్ బాబుతో పాటు కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ‘ఈడోరకం ఆడోరకం’ ఆడియో విడుదల కాబోతోంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సాయికార్తీక్ సంగీతాన్నందిస్తున్నాడు.
Tags:    

Similar News