ట్రైలర్ టాక్: ఇద్దరూ కలిస్తే అదోరకం

Update: 2016-04-09 04:13 GMT
''ఈడోరకం.. ఆడోరకం'' సినిమా ఆడియో ఆల్రెడీ విడుదలైంది. రాజ్‌ తరుణ్‌ అండ్‌ మంచు విష్ణు కాంబినేషన్‌ లో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి రూపొందించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌.. వివిధ సెటైర్లతో.. మోహన్‌ బాబు క్లాసు పీకడంతో.. చాలా పెద్ద న్యూస్‌ అయిపోయింది. అయితే ఆడియో రిలీజైంది కాని.. ఇంతవరకు ట్రైలర్‌ మాత్రం రిలీజ్‌ కాలేదు.

ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు. యథావిథిగా ఇద్దరు హీరోలూ.. వారికి ఇద్దరు హీరోయిన్లు.. అయితే ఒకరి హీరోయిన్ ను మరొకరికి జోడి అనుకుని ఫ్యామిలీ అందరూ కన్ఫ్యూజ్‌ అవ్వడమే సినిమా. రాజేంద్రప్రసాద్‌ - రవిబాబు - ప్రభాస్‌ శీను తదితరుల కామెడీ సినిమాకు హైలైట్‌ అని తెలుస్తోంది. రాజ్‌ అండ్‌ విష్ణు చాలా హ్యాండ్సమ్‌ గా ఉంటే.. సోనారికి బడోరియా అండ్‌ హెబ్బా పటేల్‌ లు గ్లామర్‌ ను దారాళంగా ఆరబోసి.. ఆకట్టుకున్నారనే చెప్పాలి.

అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రియల్‌ 14న విడుదల చేస్తున్నట్లు కన్ఫామ్‌ చేశారు కూడా.
Full View

Tags:    

Similar News