రాత్రిపూట డార్క్ గ్లాసెస్ తో హీరోయిన్

Update: 2018-11-22 05:13 GMT
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు కనబడరన్న సంగతి అందరికీ తెలిసిందే.  కారణాలేవైనా అలాంటి పరిస్థితిలో కూడా హీరోయిన్ గా నెట్టుకురావడమే కాకుండా తన సత్తా చాటుతోంది ఈషా రెబ్బా. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' లో సెకండ్ హీరోయిన్ గా నటించింది గానీ పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు సుమంత్ హీరోగా నటించిన 'సుబ్రహ్మణ్యపురం' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా డిసెంబర్ మొదటివారంలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. నిన్ననే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమలో ఈశా రెబ్బా గెటప్ పూర్తిగా మారిపోయింది. తెలుగమ్మి కాస్తా మోడరన్ టెల్గు గాళ్ కనిపించింది. స్ట్రెయిట్ చేసిన హెయిర్..  టీ-షర్ట్  పైన ఒక స్వెటర్ లాంటి టాప్.. మిడ్డీతో దర్శనమిచ్చింది.  కళ్ళకు డార్క్ గ్లాసెస్ పెట్టుకోవడంతో అసలు ఈషా ను గుర్తుపట్టడం కూడా కష్టం అయింది. అసలు రాత్రి పూట కూలింగ్ గ్లాసెస్ ఏంటని కొందరు గుసగుసలాడుకున్నారు.  మరి ఇది గమనించిందేమో గానీ తన స్పీచ్ లో ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. తనకు ఐ ఇన్ఫెక్షన్ ఉందని.. అందుకే నల్లటి కళ్ళజోడు పెట్టుకున్నానని తెలిపింది.  

ఈవెంట్ లో తన స్పీచ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.."డైరెక్టర్ సంతోష్ గారు కథ చెప్పినప్పుడు నేను మనసులో అది ఊహించుకోగాలిగాను. థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం.  సంతోష్ ఈ సినిమా విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. తనకు ఏం కావాలి అనే విషయంలో ఆయనకు  ఫుల్ క్లారిటీ ఉంది. ఈ ప్రాజెక్టులో భాగం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమానే కాకుండా సంతోష్ ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను."  అని చెప్పింది.  

హీరో సుమంత్ గురించి మాట్లాడుతూ " సుమంత్ గారి సినిమాలు చాలా చూశాను. అందులో నా ఫేవరెట్ సినిమాలు ఛాలా ఉనాయి.. అయన చాలా చాలా మంచి నటుడు. ఆయన చాలా సపోర్టివ్ గా ఉంటారు..  ఈ సినిమా చేసినందువల్ల మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాము" అని చెప్పింది.  డిసెంబర్ ఫస్ట్ వీక్ లో సినిమా రిలీజ్ అవుటుందని ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని తెలిపింది.  


Tags:    

Similar News