డిజైన‌ర్ టాప్ తో టాప్ లేపిన ఈషా

Update: 2021-12-16 10:30 GMT
ఓవైపు సినిమాలు .. మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌తో కెరీర్ బండిని న‌డిపించేస్తోంది తెలుగ‌మ్మాయ్ ఇషారెబ్బా. తెలుగులో అవ‌కాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా అటు మ‌ల‌యాళం.. త‌మిళంలోనూ నెమ్మ‌దిగా ప్ర‌ణాళిక‌ల్ని విస్త‌రించి సక్సెస‌వుతోంది. క‌ల‌ర్స్ స్వాతి-బిందుమాధ‌వి త‌ర‌హాలోనే ఇషా రెబ్బా ఇరుగు పొరుగు భాష‌ల్లో పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది. స్టార్ల సినిమాల్లో అవ‌కాశాల్ని అందుకుంటోంది.

ఎన్టీఆర్ `అరవింద సమేత` వంటి భారీ సినిమాలో న‌టించిన ఈ బ్యూటీకి ఇరుగు పొరుగునా క్రేజ్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమాల్లో వేగంగా ఆఫర్లు అందుకోలేక ఈషా రెబ్బా ఇబ్బంది ప‌డింది. ఆ క్ర‌మంలోనే ఓటీటీ కంటెంట్ పైనా దృష్టి సారించింది. ఇంత‌కుముందు `పిట్ట కథలు`- `3 రోజెస్` వంటి OTT సిరీస్ లతో న‌టిగా నిరూపించుకుంది.

అలాగే మలయాళంలోను ఈషా అడుగుపెట్టింది. ఇటీవలే తన తొలి మలయాళ చిత్రం ఒట్టు షూటింగ్ ను ఈషా రెబ్బా ముగించింది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. మలయాళంలో నా తొలి అరంగేట్రం...ఈ చిత్రం షూటింగ్ లో నాకు లభించిన అత్యంత ఎగ్జ‌యిటింగ్ ఎక్స్ పీరియెన్స్ ని మ‌రువ‌లేను! అని ఈషా ట్వీట్ చేసింది.

ఈషా రెబ్బా ఇన్ స్టాగ్రామ్ క్వీన్ గానూ ప్రజాదరణ పొందుతోంది. ఈ వేదికపై ఈషా రెండు మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. అందుకు త‌గ్గ‌ట్టే నిరంత‌రం స్పెష‌ల్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ హీట్ పెంచుతోంది.

ఇషారెబ్బా తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారుతోంది. రెడ్ క‌ల‌ర్ మ‌క‌మ‌ల్ టాప్.. బ్లాక్ ట్రాక్ ఫ్యాంట్ లో ఈషా ఎంతో అందంగా క‌నిపిస్తోంది.

ఇది ఆన్ లొకేష‌న్ షూట్ స‌మయంలో క్లిక్ అని అర్థ‌మ‌వుతోంది. రెడ్ డిజైన‌ర్ టాప్ కి త‌గ్గ‌ట్టుగా మెడ‌లో నెక్లెస్.. చెవి జూకాలు.. పాపిడి బొట్టు ను అలంక‌రించుని ఎంతో అందంగా క‌నిపిస్తోంది.


Tags:    

Similar News