బూతునే డీసెంట్‌ గా చూపించారట!

Update: 2021-05-26 11:30 GMT
'వర్షం' చిత్ర దర్శకుడు దివంగత శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తను నేను.. పేపర్‌ బాయ్‌ సినిమాలతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి కమర్షియల్‌ గా సంతోష్‌ కు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ ను తెచ్చి పెట్టలేక పోయాయి. హీరోగా మూడవ సినిమా ఏక్‌ మినీ కథ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. దాంతో ఓటీటీ రిలీజ్‌ కు సిద్దం అయ్యారు. ఈ వారంలో అమెజాన్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ సినిమా బోల్డ్‌ కాన్సెప్ట్‌ అంటూ చెప్పకనే చెప్తోంది.

హీరోకు ఉన్న ఒక బోల్డ్ సమస్యను ఫన్నీగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. చిన్నప్పటి నుండి పెద్ద వాడు అయ్యే వరకు అతడు ఆ సమస్య కారణంగా పడ్డ మానసిక సంక్షోభంను ఈ సినిమాలో చూపించారట. కాస్త పచ్చిగా చెప్పుకోవాలంటే బూతు కాన్సెప్ట్‌ ఇది. బూతును ఎవరైనా పద్దతిగా చూపిస్తామంటే ఏమనిపిస్తుంది. అంత సీన్‌ లేదులే అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తాయి. ఇప్పుడు ఏక్‌ మినీ కథ సినిమా గురించి కూడా నెట్టింట అదే ప్రచారం జరుగుతోంది. కాన్సెప్ట్‌ బూతు  అయినా కూడా తాము డీసెంట్‌ గా చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి బూతు కాన్సెప్ట్‌ ను ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ గా రూపొందించేందుకు ప్రయత్నించారట. ట్రైలర్‌ చూస్తుంటే ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా రూపొందినట్లుగా అనిపిస్తుంది. ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా చిత్ర యూనిట్ సభ్యులు ఆశిస్తున్నట్లుగా డీసెంట్‌ గా ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఉంటుందా అనేది చూడాలి. ఈ సినిమాను బాలీవుడ్‌ హిట్‌ మూవీ విక్కీ డోనర్‌ తో మేకర్స్ పోల్చుతున్నారు. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ వారు నిర్మించారు. సంతోష్‌ కు ఈ సినిమా అయినా సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి. ప్రభాస్‌.. చరణ్‌ వంటి స్టార్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం తమ వంతు చేయి వేశారు.
Tags:    

Similar News