టీవీలో 'యాత్ర' ఆగదు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ

Update: 2019-04-06 13:07 GMT
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఆధారంగా వచ్చిన  'యాత్ర' సినిమా టీవీ ప్రీమియర్ షోను ఆపించాలని ట్రై చేసిన తెలుగుదేశం పార్టీకి ఈసీ రెడ్ సిగ్నల్ వేసింది. రేపు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీవీలో  'యాత్ర' సినిమా ప్రసారం కానున్న నేపథ్యంలో.. అది ఆపాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది.

తెలుగుదేశం ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ అందుకు నో చెప్పింది. టీవీలో ఆ సినిమా ప్రసారాన్ని ఆపడం తమ పని కాదంటూ ఈసీ తేల్చి చెప్పింది.

ఒకవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపిన తెలుగుదేశం పార్టీకి,  'యాత్ర'  ప్రసారాన్ని ఆపడం మాత్రం సాధ్యం కాలేదు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల కమిషన్ ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.

'యాత్ర' సినిమా ప్రదర్శనలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈసీ ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. టీవీ, థియేటర్లలో ప్రదర్శితం అయ్యే సినిమాలను ఆపడం తమ పరిధిలోని అంశం కాదని ఈసీ తెలిపినట్టుగా సమాచారం. ఆ సినిమాలో ఎన్నికల నిబంధలను ఉల్లంఘించే  అంశాలేవని కూడా ఈసీ తేల్చి చెప్పడం విశేషం. ఈసీ గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం స్టార్ మా లో  'యాత్ర' సినిమా ప్రసారం కావడం ఖాయమే అని చెప్పాలి.


Tags:    

Similar News