RRR 2021 మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్రచారంలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ లను కలిపి జక్కన్న చేస్తున్న అసాధారణ పాన్ ఇండియా చిత్రమిది. దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేసేందుకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శరవేగంగా నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేస్తున్నారు.
ఇటీవలే దోస్తీ సాంగ్ లాంచ్ తో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మరోసారి పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉక్రెయిన్ -రష్యా లొకేషన్ నుంచి తారక్ చరణ్ ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇకపై వరుసగా ప్రమోషనల్ వీడియోలను రిలీజ్ చేయనున్నారు.
ఇంతలోనే చరణ్ - తారక్ బుల్లితెరపై తమ అభిమానులకు అద్భుత ట్రీట్ ని ప్లాన్ చేయడం చర్చల్లోకొచ్చింది. ఆగస్టు 22 న జరిగే `ఎవరు మీలో కోటీశ్వరులు` కర్టెన్-రైజర్ ఎపిసోడ్ తో రంజైన ట్రీట్ ఇవ్వనున్నారు. యాథృచ్ఛికంగా అదే రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడం కలిసొచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీలో ఈ కార్యక్రమం వినోదాత్మకంగా ప్రారంభమవుతుంది. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో ఇటీవలే రిలీజై బోలెడంత ఫన్ ని పంచింది. ప్రోమలో చెర్రీ- తారక్ మధ్య పరాచికం చాలా హాస్యంతో ఫన్నీగా అలరిస్తోంది. ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ లో ఇది హైలైట్ గా నిలవనుందని అర్థమవుతోంది. ఇకపోతే పూర్తి ఎపిసోడ్ ని వీక్షించేందుకు తారక్ - చరణ్ అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. కర్టెన్ రైజర్ షో ఆగస్టు 22 న రాత్రి 8:30 గంటలకు జెమిని టీవీలో ప్రసారం అవుతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్- RRR మాత్రం ఈ ఎపిసోడ్ కి పూర్తి భిన్నమైనది. సీరియస్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ స్వాతంత్య్ర కాలం నాటి వాతావరణం తెరపై కనిపిస్తుంది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన ఒక సీరియస్ పీరియడ్ డ్రామా. ఫిక్షనల్ పాత్రలతో ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. డ్రామా భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టి తెరకెక్కిస్తున్నారు. కామెడీ ట్రాక్ అనేది సపరేట్ గా ఉండేందుకు ఆస్కారం లేదు.
ఎట్టకేలకు `ఆర్.ఆర్.ఆర్` చివరి అంకం షూటింగ్ పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉక్రేయిన్ షూటింగ్ లో జక్కన్న టీమ్ బిజీ బిజీ. చరణ్- తారక్ సహా కీలక నటీనటులంతా షెడ్యూల్ లో పాల్గొన్నారు. కీలకమైన పాటల్ని అక్కడే షూట్ చేసారు. విదేశీ షెడ్యూల్ కాబట్టి సినిమాకి సంబంధించిన ముఖ్యమైన క్రూ మాత్రమే హాజరయ్యారు. జక్కన్న అలాగే కొరియోగ్రాఫర్ల ఆధ్యర్యంలోనే పాటల చిత్రీకరణ పూర్తి చేసారు.
`ఆర్.ఆర్.ఆర్` తో జక్కన్న పరిశ్రమలో ఎదురే లేని అగ్ర హీరోల అభిమానుల్ని ఏకం చేసారు. మెగా-నందమూరి బాండింగ్ ని ఇది మరింత ధృఢం చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. టాకీ పార్టు పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసారు. వాటిని ప్రత్యేకంగా జక్కన్న టెక్నికల్ టీమ్ దగ్గరుండి చూసుకుంటుంది. ఈ చిత్రాన్ని డి. వి.వి. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
కాంబినేషన్ తోనే సూపర్ ఎనర్జీ
RRR లో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా కొమరం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన అలియా నటిస్తుండగా తారక్ సరసన ఒలీవియా నటిస్తోంది. కథానాయికలు ఒలీవియా.. ఆలియా పాత్రలను జక్కన్న ఒక రేంజులోనే ఎలివేట్ చేసారని టాక్. అలియా భట్ దక్షిణాదినా ఇప్పటికే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఆర్.ఆర్.ఆర్ ఆఫర్ తో తన పేరు మార్మోగిపోతోంది. తదుపరి సౌత్ లోనూ పెద్ద స్టార్ గా అవతరించనుంది. ఇక ఇందులో అజయ్ దేవగన్ పాత్రా ఆద్యంతం రక్తి కట్టించనుందని తెలిసింది.
Full View