న‌ల్ల‌గా ఉన్నాన‌ని అంద‌రూ న‌న్నే చూసారు!

Update: 2022-08-19 02:30 GMT
సంగీత దిగ్గ‌జం..స్వ‌ర మాంత్రికుడు ఏ. ఆర్  రెహ‌మాన్ మ్యూజిక్  సంచ‌ల‌నాల గురించి ప్ర‌పంచానికి తెలిసిందే. ఆస్కార్ అవార్డు లు సైతం అందుకుని భార‌తీయ సినిమా ఖ్యాతిని పెంచిన గొప్ప మ్యూజిక్ ద‌ర్శ‌కుడిగా ఆవిర్భ‌వించారు. సంగీతం గురించి చెప్పాల్సి వ‌స్తే రెహ‌మాన్ కి ముందు..త‌ర్వాత అని క‌చ్చితంగా చెప్పాల్సిందే. సంగీతంలో ఆయ‌నో ఎన్ సైక్లో పీడియా.

అంతర్జాతీయ వేదిక‌ల‌పైనా రెహమాన్ మ్యూజిక్ షో అంటే ఓ సంచ‌ల‌నం. అంత‌గా విదేశాల్లోనూ రెహ‌మాన్ ఫేమ‌స్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాల క‌న్నా మ్యూజిక్ షోస్ ఎక్కువ‌గా చేస్తున్నారు. సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నా...చాలా రేర్ గా మాత్ర‌మే ప‌ని చేస్తున్నారు. బాలీవుడ్ అవ‌కాశాలు సైతం వ‌దులుకుని మ్యూజిక్ క‌న్స‌ర్ట్  పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు.

అంత‌టి లెజెండ్ కి సైతం  విదేశాల్లో అవ‌మానం త‌ప్ప‌లేదన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ని ఇబ్బంది పెట్టిన ఆ సంఘ‌ట‌నని తాజాగా రెహ‌మాన్ గుర్తు చేసుకున్నారు. ``2013 లో హాలీవుడ్ కి `ప్రోజెన్` చిత్రం యూనిట్ ఇచ్చిన పార్టీకి వెళ్లాను. అక్క‌డే వాల్ట్  డిస్నీ విగ్ర‌హం కూడా ఉంది. విగ్ర‌హం బాగుంద‌ని సెల్పీ కోసం వెళ్లి ప‌క్క‌నే నుంచున్నాను.

విగ్ర‌హంతో సెల్పీ తీసుకుని వెన‌క్కి తిరిగి  చూసాను. అప్పుడు దాదాపు 100 మంది న‌న్ను అదే ప‌నిగా చూస్తున్నారు. వాళ్లు ఎందుక‌లా చూస్తున్నారో?  ముందు నాకు అర్ధం కాలేదు. ఆ త‌ర్వాత కాసేప‌టికి నాకు విష‌యం అర్ధ‌మైంది. ఆ విగ్ర‌హం ప‌క్కన నేను మాత్రం బ్రౌన్ గా క‌నిపిస్తున్నాను. విదేశీయుల రంగు..నాది వేరేని గ‌మ‌నించాను.

ఈ ఘ‌ట‌న ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను` అని అన్నారు. రెహామాన్ చేసిన ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇటీవ‌లి కాలంలో రెహ‌మాన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విదేశీ అనుభ‌వాల్ని ఎక్కువ‌గా పంచుకుంటున్నారు. స‌ర‌దా సంభాష‌ణ‌లు సైతం షేర్ చేసుకుంటున్నారు.

ఈ ఏడాది నుంచి రెహ‌మాన్ సినిమాల‌పైనా దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఆయ‌న వివిధ భాష‌ల్లో చాలా సినిమాల‌కు సంగీతం అందిస్తున్నారు. త‌మిళ్..హిందీ..ఇంగ్లీష్..మ‌ల‌యాళం..అర‌బిక్ భాషల చిత్రాల‌కు ప‌నిచేస్తున్నారు.
Tags:    

Similar News