'శ్రీదేవి సోడా సెంటర్' గురించి అందరూ మాట్లాడుకుంటారు

Update: 2021-08-26 17:30 GMT
సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ బాబు.. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు 'శ్రీదేవి సోడా సెంటర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్ గా నటించింది. విజయ్ చిల్లా - శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని రేపు శుక్రవారం థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుధీర్ బాబు మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

* 'పలాస 1978' చూసి డైరెక్టర్ కరుణ కుమార్ కి కాల్ చేసి మంచి లైన్ ఉంటే చెప్పండి చేద్దాం అన్నాను. అదే సమయంలో ఫస్ట్ లాక్ డౌన్ పెట్టారు. ఆ టైం లోనే కొంచెం రిస్క్ అయినా సరే డైరెక్ట్ గా మీట్ అయి స్టోరీ విన్నాను. మంచి కథ విన్నాను అనిపించింది. అలా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.

* సినిమాలన్నీ ఒకేలా ఉండవు. నేను డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేశాను. ఒక్కో దానికి ఒకటి సంబంధం లేకుండా చేసినప్పుడు అన్నిటికీ సూట్ అయ్యాను అనేవాళ్ళు ఉంటారు. ఇపుడు ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అలా అని రా సబ్జెక్ట్ మాదిరిగా ఉండదు. మంచి కంటెంట్ కు కమెర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఇప్పటి వరకు అందరూ మలయాళ సినిమాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటి నుంచి తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటారు. అందుకే ఈ సినిమా చేశా.

* సినిమాలో పర్టిక్యులర్ గా ఒక క్యాస్ట్ గురించి అని ఏమీ ఉండదు. గ్రామంలో ఉండే లోకల్ పాలిటిక్స్, అక్కడ ఉండే మనుషుల స్వభావాలు ఈగోలు వంటివి కనిపిస్తాయి. అంతే తప్ప అంతకు మించి ఏం ఉండదు. ఇది పాత కాలపు సినిమా కాదు. ప్రస్తుతం నడిచే స్టోరీనే. అన్ని పాత్రలు మనకి తెలిసినట్టుగానే ఉంటాయి.

* నేను సూరిబాబు అనే ఒక ఎలక్ట్రిషియన్ గా కనిపిస్తాను. అతనికి తన అమ్మ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఉండదు కానీ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు. మళ్ళీ తన అమ్మ లాంటి అమ్మాయి ఎదురైతే వాళ్ళు ప్రేమలో పడటంతో వారి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయనేది ఆసక్తికరం. కేవలం ప్రేమ కథలో భాగంగానే సామాజిక అంశాలను చెప్పామే తప్ప సందేశం ఇవ్వలేదు.

* ఇందులో నా లుక్ స్పెషల్ గా ఉంటుందని సినిమా చెయ్యలేదు. నా గత సినిమాలు అన్నీ చూసుకొని ఎలా ఉంటుందా అని ఇది ఓకే చేశా. దీని కోసం స్పెషల్ ట్రైనింగ్ ఏమి తీసుకోలేదు. కాకపోతే గోదావరి యాస సహజంగా పలికేందుకు డైలాగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. అలానే కొంతమంది ఎలక్ట్రిషియన్స్ తో మాట్లాడి.. కటింగ్ ప్లేయర్ ఎలా పట్టుకుంటారు.. వైర్లు ఎలా తీస్తారు లాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకున్నాను.

* స్టార్టింగ్ నుంచే ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు చేస్తున్నాం.

* తెలుగు అమ్మాయి ఆనంది ఇందులో హీరోయిన్. మన వాళ్ళతో వర్క్ ఎలా ఉంటుందో తెలిసిందే. మన ఇంట్లో వాళ్ళతో ఎంత ఫ్రీగా ఉంటామో అలా అనిపించింది. తనతో ముందు 'ప్రేమ కథా చిత్రం' చెయ్యాల్సి ఉంది. కానీ అప్పుడు నందిత ని ఓకే చేసాం. కానీ తమిళ్ లో ఆ సినిమా ఆనంది చేసింది. అది చూసాక బాగా చేసింది అనిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చాలా సిన్సియర్ గా వర్క్ చేసింది. తనతో కలిసి పని చేసినందుకు హ్యాపీగా ఉంది.

* కథలు రాసే వాళ్ళు దర్శకులుగా మారితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ కరుణ కుమార్ లో ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా సీన్ లో చిన్న మార్పు చెయ్యాలన్నా అక్కడికక్కడే డైలాగ్ రాయగలడు. చాలా స్ట్రాంగ్ ఐడియాలజీ తనలో ఉంది. అతను చాలా మంచి కంటెంట్స్ రాయగలడు.

* నా దగ్గరకి వచ్చిన కథల్లో హీరో - విలన్ రెండిటికి ఒకే ఇంపార్టెన్స్ ఉంటే దేనిని ఎంచుకుంటారు అని అడిగితే.. నేను ఖచ్చితంగా హీరో అనే చెప్తాను. ఎందుకంటే నేను సినిమాలు చూస్తూ పెరిగాను. హీరో అంటే ఇలా ఉంటుందా ఆడియెన్స్ లో వారి మీద అభిప్రాయాలు ఎంటనేది చూసా. అందుకే హీరోగానే ప్రిఫర్ చేస్తా. అయితే విలన్ గా చేసినపుడు కూడా ఆడియెన్స్ నన్ను యాక్సెప్ట్ చేశారు.

* 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ స్టార్ట్ అయిన రోజు నుంచే కొన్ని సమస్యలు ఎదుర్కొంది. ఇప్పుడు జంగ్లీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.
Tags:    

Similar News