ప్రస్తుతం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'కేజీఎఫ్ 2' ఒకటని చెప్పవచ్చు. నేషనల్ వైడ్ గా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన మొదటి కన్నడ సినిమా 'కేజీఎఫ్'. ఈ సినిమాతో హీరో యష్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. తెలుగు తమిళ్ కన్నడ హిందీ అని తేడా లేకుండా ఈ యాక్షన్ మూవీ సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా డిజిటల్ గా కూడా మన భారతీయ సినీ చరిత్రలోనే భారీ వ్యూవర్ షిప్స్ ను కూడా రాబట్టుకుంది. మొదటి పార్ట్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ నమోదు అయితే ఇక రెండో పార్ట్ ఎలా ఉంటుందో అని అంతా ఊహించుకుంటున్నారు.
'కేజీఎఫ్ చాప్టర్ -1' పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించడంతో దేశం మొత్తం 'కేజీఎఫ్-2' కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తోంది. 'కేజీఎఫ్-1' శుభం కార్డు పడింది మొదలు.. కొనసాగింపు భాగం కాబట్టి ఆ తర్వాత పార్ట్ ని ఎలా చూపించబోతున్నారో అనే ఉత్కంఠ అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ నెలకొనివుంది. అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. 'కేజీఎఫ్' మొదటి పార్ట్ లో ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరు ఊహించని విధంగా మనసుకు హత్తుకునేలా ప్రజెంట్ చేశాడు. ఇక అదే తరహాలో సెకండ్ పార్ట్ కూడా అంతకు మించిన ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఆడియెన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు.
కాగా 'కేజీఎఫ్ చాప్టర్ -1' జస్ట్ ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా చాప్టర్ 2 లో చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించిన విలన్స్ ని చూపించి హీరో స్థాయిని తెలియకుండానే పెంచేశారు. ఇక కేజీఎఫ్ లాంటి పెద్ద కథలో మెయిన్ విలన్ ఎలా ఉండాలో మన ఊహలకు అందదు. అందుకే ప్రశాంత్ బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ని అధీరా పాత్ర కోసం ఎంచుకున్నాడు. రవీనా టండన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక ఎవరినైనా ఎదుర్కొనే రాకీ భాయ్ వారితో ఎలా తలపడతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ‘కేజీఎఫ్ 2’ని హెంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ప్రభుత్వం అనుమతులిస్తే మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి చెప్పిన విధంగా దసరాకి వస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.