క్రిష్ హేమ్స్ వర్త్ మెయిన్ లీడ్ లో నటించిన ఎక్స్ ట్రాక్షన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మొదటి పార్ట్ ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. అందులో రణదీప్ హుడా కూడా కీలక పాత్రలో నటించాడు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఎక్స్ ట్రాక్షన్ 2 నెట్ ఫ్లిక్స్ లో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ క్రేజీ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మంచి ఆదరణ ఉంది.
ఎక్స్ ట్రాక్షన్ 2 మూవీ కొనసాగింపులో హీరో క్రిష్ హేమ్స్ వర్త్ టైలర్ రేక్ గా తిరిగి వస్తాడో. ఇక మాఫియా నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి పోరాటం మొదలు పెడతాడు. ఇద్దరు జార్జీయన్ గ్యాంగ్ స్టార్ లలో ఒకడు జైల్లో ఉంటే ప్లాన్ లు వేస్తూ ఉంటాడు. వాటిని బయట ఉన్న వ్యక్తి అమలు చేస్తూ ఘోరాలు చేస్తూ ఉంటారు. అతని గ్యాంగ్ బారిన పడిన తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి టేలర్ రేక్ పోరాటం స్టార్ట్ చేయడంతో ఈ కథ నడుస్తుంది.
గోల్‌షిఫ్తే ఫరాహానీ, టోర్నికే గోగ్రిచియాని, ఆడమ్ బెస్సా, డేనియల్ బెర్న్‌హార్డ్ట్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. మొదటి సినిమాతో పోల్చుకుంటే ఎక్స్ ట్రాక్షన్ 2 అంత గొప్ప కథ అయితే కాదు. రొటీన్ కథనే సినిమాకి రైటర్ జో రుస్సో అందించాడు. అయితే దానిని ఎఫెక్టివ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆవిష్కరించడం కాస్తా ఆకట్టుకునే విధంగా ఉంది.
ముఖ్యంగా సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే విధంగా ఉంటాయి. ఇక హీరోగా చేసిన క్రిష్ హేమ్స్ వర్త్ తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన పాత్రధారులు కూడా వారి పరిధిలో అద్భుతంగానే నటించారు. అయితే రొటీన్ స్క్రిప్ట్ కాబట్టి పెద్దగా ఎగ్జైట్ చేసే విధంగా లేకపోయిన ఓవరాల్ గా మాత్రం ఒకసారి చూసే విధంగా ఉంది.
ఈ వారం వచ్చిన హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ది ఫ్లాష్ ఆకట్టుకుంటోంది. ఆదిపురుష్ సినిమాకి ఎవరేజ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఇండియన్ మార్కెట్ లో కూడా ఆ చిత్రానికి మల్టీప్లెక్స్ లో ఆదరణ పెరగొచ్చు. ఇక ఒటీటీలో ఈ వారం ఎక్స్ ట్రాక్షన్ 2 కొంత వరకు హాలీవుడ్ మూవీస్ ఇష్టపడే వారికి ఎంటర్టైన్ చేయనుంది.