సుకుమార్ డైరక్షన్లో మెగా హీరో రామ్ చరణ్ కొత్త సినిమా మొదలులైనప్పటి నుండి చాలా ఆసక్తిగానే ఉంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ విడుదల చేసి ఆ ఆలోచనను మరింతగా పెంచింది. ''రంగస్థలం 1985'' సినిమా పేరు. విడుదలైన కొన్ని గంటలకే సోషల్ మీడియా వరల్డ్ వైడ్ ట్రెండ్లలో 45 వ స్థానం లో నిలిచింది. ఇది ఒక్కటే కాదు ఫాన్స్ సంబరాలుకు అసలు కారణం ఆ టైటిల్ లో ఉన్న గమ్మత్తును చూడండి.
ఒక ప్రక్కన చూసుకుంటే రామ్ చరణ్ పుట్టిన సంవత్సరం కూడా 1985నే. అంతే కాకుండా RAngasthalaM టైటిల్ లో ఉన్న మొదటి రెండు అక్షరాలు పేరు చివరి అక్షరం కలిప్తే RAM అనే పదం వస్తుంది. ఇది హీరో రామ్ చరణ్ పేరులో మొదటి పదం. మరో కాకతాళీయ సంఘటన ఏంటి అంటే ఇందులో హీరోయిన్గా నటిస్తున్న సమంత పేరు కూడా ఉంది. మీరు టైటిల్ లో ఉన్న అక్షరాలును తీసుకుని Samantha అనే పేరు కూడా వచ్చేలా చేయవచ్చు. సో ఇలా అభిమానులు పోస్టర్ ను బాగా అర్ధం చేసుకొని సినిమా పై మరింత ప్రేమ పెంచుకుంటున్నారు.
సుకుమార్ టీమ్ కానీ రామ్ చరణ్ తరుపున వాళ్ళు కానీ ఈ టైటిల్ అన్ని విధాలుగా కథకు సరైన పేరు అనే నమ్ముతున్నారు. ఇలా ఇప్పుడు గమ్మత్తుగా వచ్చిన స్పందన తో వీళ్ళు చాల సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా కూడా ఫ్యామిలి డ్రామా కాబట్టి తెలుగు వారి సంక్రాంతి పండుగకు విడుదల సిద్దం చేస్తున్నారు. 2018 సంక్రాంతి కానుకగా సినిమాను ధియేటర్లో చూడొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/