చిత్రం రిలీజ్ తర్వాత తేజ పేరు మార్మోగిపోయింది. పెట్టుబడికి 20 రెట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించిన తర్వాత.. తేజ తర్వాతి వెంచర్ పై ఆసక్తి నెలకొంది. అప్పటికే ఫ్యామిలీ సర్కస్ మొదలుపెట్టిన తేజ.. మరో లవ్ స్టోరీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇందులో భాగంగా బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసుకుని వెంకటేష్ కి ఓ స్టోరీ వినిపించాడు. ట్యూన్లు కూడా కట్టడం మొదలుపెట్టారు. గాజువాక పిల్లా - తుమ్మెదా.. ఓ తుమ్మెదా.. పాటల రికార్డింగ్ కూడా అయిపోయింది. కానీ వెంకీ తేజకి ఏమీ తేల్చకుండా.. నువ్వునాకు నచ్చావ్ స్టార్ట్ చేసేయడంతో.. అప్పటికప్పుడు అరగంటలో కథ రాసేసుకుని నిర్మాతలకు చెప్పేశాడు తేజ.
సినిమా స్టార్ట్ చేసేనాటికి కనీసం హీరో హీరోయిన్స్ ఎవరో కూడా నిర్ణయించలేదు. మొదటి రెండు రోజులు తెలంగాణ శకుంతల - తనికెళ్ల భరణిలపై సీన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత హీరో కోసం వేట. సుమంత్ - మాధవన్ ఇలా అడిగిన వాళ్లు ఒప్పుకోకపోవడంతో.. చివరకు చిత్రం హీరో ఉదయ్ కిరణ్ నే మరోసారి ఎంచుకున్నాడు. హీరోయిన్ ఛాన్స్ కోసం ముంబై నుంచి 20 మంది వచ్చారు. టాప్ రేంజ్ లో ఉన్న అమ్మాయి డిమాండ్స్ ఎక్కవగా చేస్తుండడంతో.. అందరి కంటే లీస్ట్ ఎవరు అని ఆమెనే అడిగి.. అనితని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు తేజ.
హైద్రాబాద్ లో ఎక్కువగా షూటింగ్, వికారాబాద్ అడవుల్లో మరికొంత చేశారు. ఎమ్మెస్ బిజీ కావడంతో.. ఆయన రోల్ తగ్గించేసి ధర్మవరపు కేరక్టర్ పెంచేశాడు డైరెక్టర్. లవర్ కూతురుని కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాననే సీన్ కి చాలామంది నుంచి అబ్జెక్షన్ వచ్చింది. కానీ తేజ పట్టించుకోలేదు. 11 పాటలు పెట్టి పెద్ద రిస్కే చేశాడన్నారు. మొత్తానికి కోటీ 63 లక్షలతో సినిమా రెడీ అయిపోయింది.
థియేటర్లలోను, బయటా సాంగ్స్ హోరెత్తిపోయాయి. ‘నువ్వు యూత్ ఏంట్రా’, ‘మూసుకు కూర్చోరా పూల చొక్కా’, ‘మీ పెద్దోళ్లున్నారే’ లాంటి డైలాగులు బాగా పేలాయి. తేజ ఊహించిన దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయి.. 21 కోట్లు కలెక్ట్ చేసిందీ సినిమా. దీన్నే తరవాత యేదిల్ అంటూ తుషార్ కపూర్ తో హిందీలో రీమేక్ కూడా చేశాడు తేజ.