యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు ఇటీవలే కోవిడ్ 19 పాజిటివ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 10 న తారక్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వివరం వెల్లడించారు. అంటే ఈ వారాంతం నాటికి 14రోజులు పూర్తయితే అతడు నెగెటివ్ అని ప్రకటించే వీలుంది. తారక్ త్వరగా కోలుకుని షూటింగుల్లో యథావిధిగా పాల్గొనాలని అభిమానులు ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే.
గత రాత్రి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీపాత్రికేయుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తారక్ సన్నిహితుల సమాచారం మేరకు.. ``ఎన్టీఆర్ ఇప్పటికే కోలుకుని సేఫ్ గా ఉన్నారని.. ఇంకా గృహనిర్భంధంలో చికిత్స పొందుతున్నార``ని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎటువంటి లక్షణాలు లేవు. కానీ తుది పరీక్షలో నెగెటివ్ అన్న రిపోర్ట్ రావాల్సి ఉంది`` అని తెలుస్తోంది.
తారక్ కంటే ముందు ఆర్.ఆర్.ఆర్ టీమ్ లో కీలక వ్యక్తులకు కోవిడ్ సోకింది. చరణ్- రాజమౌళి- ఆలియా భట్ కోవిడ్ పాజిటివ్ అని ప్రకటించారు. వారంతా చికిత్సతో సులభంగా కోలుకున్నారు. ప్రస్తుతానికి రెండవ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ నిలిపివేశారు. ఈ సన్నివేశంలో ఆర్.ఆర్.ఆర్ ముందే ప్రకటించినట్టుగా అక్టోబర్ 13 న దసరా స్పెషల్ గా విడుదలవుతుందా? అన్నదానికి సరైన జవాబు లేదు. ఈ సినిమా వాయిదా పడిందని ఇటీవల మీడియాలో కథనాలొచ్చాయి.