పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన రాధేశ్యామ్ పై ప్రభాస్ అభిమానులలో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇదివరకు సాహో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ అభిమానులను ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా సాహో సంగీతం విషయంలో ఫ్యాన్స్ చాలా నిరాశపడినట్లు టాక్. అంటే సాంగ్స్ క్లిక్ అయినప్పటికీ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసేసరికి పాటలలో అభిమానులకు కావాల్సిన సంతృప్తి దొరకలేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సాహో మ్యూజిక్ పెద్దగా ఎక్కలేదు. పూర్తిగా బాలీవుడ్ మ్యూజిక్ అవ్వడంతో తెలుగుదనం మిస్ అయింది. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాకు తెలుగులో జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారట.
హిందీ రాధేశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా మనన్ భరద్వాజ్ ఉన్నారట. తాజాగా ఆయన రాధేశ్యామ్ సంగీతంపై స్పందిస్తూ.. రాధేశ్యామ్ కోసం డిఫరెంట్ మ్యూజిక్ ఎక్సపరిమెంట్స్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాలో సంగీతం కూడా ఓ రేంజిలో ఉండబోతుందని చెప్పాడు. ఈ సినిమాకు దాదాపుగా ఆరు నెలల నుండి వర్క్ జరుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు మనన్. ప్రస్తుతం ఓ సాంగ్ రికార్డు చేస్తున్నారట. ఇంటర్నేషనల్ రేంజిలో ఆ సాంగ్ రికార్డు చేయబడిందని.. ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంటుందని ఆయన చెప్పాడు. అయితే ప్రభాస్ సినిమాలో ప్రయోగం అంటేనే ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. ముఖ్యంగా హిందీలో ఇద్దరు ముగ్గురు వర్క్ చేస్తుండటం.. సాహో మూవీకి జరిగినట్లుగా అవుతుందేమో అని భయపడుతున్నట్లు టాక్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవి క్రియేషన్స్ నిర్మిస్తోంది.