పంజాబ్ లో రైతుల నిరసనల సెగ యువనాయిక జాన్వి కపూర్ సినిమాకు అంతరాయం కలిగించింది. పాటియాలాలో `గుడ్ లక్ జెర్రీ` చిత్రం షూటింగ్ నిలిపివేయడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోనూ చిత్రీకరణ సమయంలో అంతరాయం కలిగింది. ఇప్పుడు రెండోసారి ఇబ్బంది తప్పలేదు.
కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెస్తుండగా.. దానికి వ్యతిరేకంగా తమ నిరసనకు మద్దతుగా జాన్వీని స్టేట్మెంట్ డిమాండ్ చేసిన రైతుల బృందం ఈ రోజు పంజాబ్ లోని పాటియాలా జిల్లాలో షూటింగ్ కి అంతరాయం కలిగించారు.
నిరసన కారులు జాన్వి కపూర్ రైతులకు మద్దతుగా ఒక ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ఒకవేళ అలా చేయకపోతే ఇక్కడ సినిమా షూటింగ్ ను అనుమతించమని హుకుం జారీ చేశారు.అయితే కొద్దిసేపటికే వారు షూటింగ్ కి అనుమతించారు అని తెలిసింది.
మాకు ఏ వ్యక్తిపైనా పగ లేదు. రైతులకు మద్దతుగా ఆమె ఒక్కసారి మాత్రమే ప్రకటన చేస్తే చాలు.. మేము షూటింగ్ కు అనుమతిస్తాము అని ఓ నిరసనకారుడు డిమాండ్ చేశారట. ఆ తరువాత షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్లు పోలీసు అధికారి తెలిపారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంజాబ్- హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైతులు కొన్ని వారాలుగా దిల్లీ సరిహద్దుల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు.
కొత్త చట్టాలు ఎంఎస్‌పి వ్యవస్థను బలహీనపరుస్తాయని వారు వ్యతిరేకిస్తుంటే.. అలా కాకుండా ఎంఎస్ పి వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉండేలా... కొత్త చట్టాలు రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించడానికి మరిన్ని దారులు తెరుస్తాయని కేంద్రం వారికి హామీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.