మెగా ఫోన్‌ పట్టిన 'దంగల్‌' బ్యూటీ

Update: 2020-09-03 04:30 GMT
హీరోయిన్స్‌ మెగా ఫోన్‌ పట్టుకోవడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒక్కరు ఇద్దరు సీనియర్‌ హీరోయిన్స్‌ గతంలో దర్శకత్వం వహించడం మనం చూశాం. కాని ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌ లో ఎవరు కూడా దర్శకత్వంపై ఆసక్తి చూపిస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. కాని దంగల్‌ సినిమాతో నటిగా నిరూపించుకుని ఆ తర్వాత వరుసగా హాట్‌ హాట్‌ పాత్రలను చేస్తూ స్టార్‌ హీరోయిన్స్‌ కు గట్టి పోటీ ఇచ్చే అందాల ప్రదర్శణ చేస్తున్న ఫాతిమా సనా షేక్ దర్శకురాలిగా మారింది.

ఈమె దర్శకత్వం వహిస్తున్నది సినిమాకు కాదు. ఒక మ్యూజిక్‌ వీడియోకు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన చుట్టు ఉన్న వారు ఎలా ఉన్నారు వారు ఏం చేస్తున్నారు అనే విషయాలతో ఒక పాటను చిత్రీకరించింది. విశాల్‌ భరద్వాజ్‌ ఈ పాటలో కనిపించబోతున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేయిస్తోంది. పాల్కీన్ ఖోలో... అంటూ సాగే ఈ పాట జనాలను ఆలోచింపజేస్తుందని ఆమె ఆశిస్తుంది.

పాట గురించి ఫాతిమా మాట్లాడుతూ.. విశాల్‌ నాకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. నేను ఎలా కోరుకున్నానో అలా నటించారు. ఈ పాటలో నా కుక్క బిజిలీ కూడా కనిపించబోతుంది. విశాల్‌ సర్‌ తో దానికి నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అతి త్వరలోనే ఆ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఈమె రెడీ అవుతోంది.
Tags:    

Similar News