ప్రస్తుతం సావిత్రి జీవితగాధను మహానటి పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అలనాటి మేటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తోంది. నటనలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన సావిత్రి కొన్ని అనితరసాధ్యమైన బెంచ్ మార్క్ లను కూడా సెట్ చేశారు. ఎన్టీఆర్ కు జోడీగానే కాదు.. చెల్లెలుగా నటించి మెప్పించిన ట్యాలెంట్ ఆమెది. ఇప్పుడు అలాంటిదే ఒకటి రిపీట్ అవుతోంది.
గతేడాది వచ్చిన దంగల్ మూవీ ఏ స్థాయి సక్సెస్ అయిందో చూశాం. ఆ సినిమాలో ఆమిర్ కూతుళ్లలో ఒకరిగా నటించింది ఫాతిమా సనా షేక్. ఇప్పుడు ఆమీర్ కొత్త సినిమాకి రంగం సిద్ధమవుతుండగా.. ఇప్పటికే ఈ చిత్రానికి థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అనే పేరు ఖాయం చేశారు. ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ పాత్రకు ఫాతిమా సనా షేక్ ను ఫైనల్ చేసేయడం ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ఒక సినిమాలో కూతురిగా నటించి.. మరుసటి మూవీలోనే హీరోయిన్ గా యాక్టింగ్ చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు.
ధూమ్3 డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య.. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ను రూపొందిస్తున్నాడు. తమ సినిమాలో హీరోయిన్ రోల్ చాలా ముఖ్యమని.. అందుకే పాత్రకు తగిన నటిని ఎంచుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్న కృష్ణ ఆచార్య.. ఫాతిమా సనా షేక్ ఈ రోల్ కు చక్కగా నప్పుతుందని.. కథకు న్యాయం చేస్తుందని అంటున్నాడు. ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత హీరోయిన్ గా నటించిన హిస్టరీ ఉంది. కానీ వరుస సినిమాల్లో ఇలా కూతురు నుంచి లవర్ గా మారడం మాత్రం రికార్డే.