పెళ్లిచూపులు మూవీతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. వరుస మూవీస్ తో తెగ బిజీ అయిపోయాడు కూడా. ఇవాళ ఈ కుర్రాడి పుట్టిన రోజు కాగా.. కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ తో పాటు.. ప్రీలుక్ కూడా రిలీజ్ చేసేశారు.
పెళ్లిచూపులు నిర్మాత యష్ రాగినేని నిర్మాణంలో.. భరత్ కమ్మ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ కొత్త మూవీ రూపొందనుంది. ఈ మూవీ హీరోయిన్ విషయంలో మేకర్స్ ఇప్పటికే ఓ ఫైనల్ డెసిషన్ కు వచ్చేశారట. దంగల్ మూవీలో ఆమీర్ ఖాన్ కూతురుగా ప్రపంచాన్ని మెప్పించిన ఫాతిమా సనా షేక్ ను.. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయించేందుకు ఫిక్స్ అయ్యారట మేకర్స్. అయితే.. హీరోయిన్ ఫాతిమాను ఇంకా మేకర్స్ సంప్రదించలేదని.. ప్రస్తుతానికి ఆమెతో డిస్కషన్ కి మాత్రం టైం తీసుకున్నారని తెలుస్తోంది. కానీ స్టోరీ పరంగా ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు దంగల్ బ్యూటీ ఫుల్లుగా న్యాయం చేస్తుందన్నది దర్శకుడి ఆలోచనగా చెబుతున్నారు.
త్వరలోనే ఫాతిమా సనా షేక్ ను కలిసి.. స్టోరీ నెరేషన్ ఇచ్చేసి.. ఆమెను ఒప్పించేసి.. టాలీవుడ్ కి తెచ్చేస్తామని బాగా నమ్మకంగా ఉన్నారు ఈ ఫిలిం మేకర్స్. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో పక్కన నటించేందుకు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అర్జున్ రెడ్డి మూవీని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ.