త్వరలోనే ఫిదా హిందీ రీమేక్

Update: 2017-08-21 10:12 GMT
శేఖర్ కమ్ముల సినిమాలకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మళ్లీ మరోసారి చూపించింది ఆయన రీసెంట్ మూవీ ఫిదా. వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ సినిమా అటు నిర్మాతలకి - ఇటు బయ్యర్లకి లాభాలు బాగానే తెచ్చిపెట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫిదాను బాలీవుడ్ లో కి రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలైయ్యాయి అనే టాక్ నడుస్తోంది. పంజాబ్ బ్యాక్ డ్రాప్ తో ఫిదాను తెరకెక్కించేందుకు కొందరు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఈ సినిమాలో హీరో కంటే హీరోయిన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వలన ఆ పాత్రను ఓ క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ తో చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అంతేకాదు ముందు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న ఓ నార్త్ భామనే ఫిదా హిందీ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని బీటౌన్ జనాలు అంటున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. త్వరలోనే దిల్ రాజు కూడా బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. దీంతో ఫిదా రీమేక్ తోనే దిల్ రాజు బాలీవుడ్ కి అడుగుపెడుతున్నాడా లేదా అనే విషయం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మరి త్వరలోనే ఈ రీమేక్ పై ఎదైనా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News