స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఈ రోజు స్పెషల్ డే. కారణం ఆర్య విడుదలై ఇవాల్టికి సరిగ్గా 15 ఏళ్ళు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా మాములుగా లేదు. గంగోత్రితో పరిచయమై మొదటి సినిమానే హిట్టు కొట్టినప్పటికీ బన్నీకి దాని వల్ల వచ్చిన ఇమేజ్ కాని ప్రత్యేకమైన మార్కెట్ కాని పెద్దగా లేదు. ముఖ్యంగా లుక్స్ పరంగా కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.
కాని ఆర్యలో తనను తాను తీర్చిదిద్దుకున్న తీరు చూసి ఎవరికి నోటమాట రాలేదు. డాన్సుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మొదటి సినిమానే వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ తీర్చిదిద్దిన తీరు అతనికే సొంతమైన సిగ్నేచర్ స్టైల్ ని టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఇంకో అబ్బాయిని ప్రేమించిన అమ్మాయిని చాలా కన్విన్సింగ్ గా తనవైపుకు తిప్పుకునేలా చేసిన హీరో ప్రేమ కథను ఆవిష్కరించిన తీరుకు బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిసింది
ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం యువతరాన్ని ఊపేసింది. ఐటెం సాంగ్స్ లో ఓ ట్రెండ్ సృష్టించిన ఆ అంటే అమలాపురం ఇప్పటికీ హాట్ ఫేవరేట్ గానే నిలుస్తోంది. దాని ప్రభావంతో తెలుగు సినిమాల్లో ఆ తర్వాత ఎన్ని ఐటెం సాంగ్స్ వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. అవి కాకుండా ఫీల్ మై లవ్ అనే సాంగ్ ఏకంగా ప్రేమికుల తారక మంత్రంగా నిలిచిపోయింది.రత్నవేలు టాలెంట్ తెలిసింది కూడా దీని వల్లే.
ఆర్య తర్వాతే అల్లు అర్జున్ ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. అందుకే ఈ రోజు ఫేస్ బుక్ లో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆర్య ఎంత స్పెషల్ మూవీనో చెప్పాడు బన్నీ. ఇదే కాంబోలో దీనికి సీక్వెల్ ఆర్య 2 వచ్చింది కాని క్లాసిక్ గా నిలిచిన మొదటి భాగం అంచనాలు అందుకోలేకపోయింది. అందుకే ఆర్య సెలబ్రేషన్స్ పేరుతో ఫ్యాన్స్ ఇంతగా సంబరపడుతున్నారు.