సినీ , జర్నలిస్ట్ వర్గాల్లో విషాదం అలుముకుంది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ ఇక లేరు. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నటుడు పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయని అంటున్నారు.
కత్తి మహేష్ రెండు వారాల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో కారు ప్రమాదంలో చికిత్స పొందుతూ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జు అయ్యింది. వెంటనే కత్తి మహేష్ ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు పరిస్థితి విషమించడంతో చనిపోయారు.
ఆపదలో ఉన్నాడని తెలియగానే చాలామంది సాయం చేయడానికి ముందుకొచ్చారు. కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా సాయం చేస్తామన్నా కత్తి మహేష్ తీసుకోలేదట.. అయితే కత్తి మహేష్ విషయంలో ఏపీ ప్రభుత్వం మానవత్వంతో స్పందించింది. ఎవరూ కోరకుండానే పెద్ద సాయాన్ని ప్రకటించింది. ఏకంగా కత్తి మహేష్ ఆస్పత్రి ఖర్చులన్నీ భరించేందుకు ముందుకు వచ్చింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న సినీ నటుడు కత్తి మహేష్ కు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి ‘సీఎంఆర్ఎఫ్’ కింద రూ.17 లక్షలను విడుదల చేసింది. ఈ మేరకు సీఎం స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.
గత కొంతకాలంగా జనసేన, టీడీపీలను విమర్శిస్తూ వైసీపీకి మద్దతుగా కత్తి మహేష్ రాజకీయం చేస్తున్నారు. పలు వైసీపీ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ కు ఏపీ ప్రభుత్వం ఈ సాయం చేసింది.
కత్తి మహేష్ ను ఆయన స్నేహితులు అయిన సినిమా రంగానికి చెందిన దర్శకుడు సాయి రాజేశ్, ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డిలు దగ్గరుండి చూసుకుంటున్నారు. మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ వారు వెల్లడించారు. కత్తి మహేష్ కంటికి గాయమైందని..పలు శస్త్రచికిత్సలు చేశారు. ఆయన కూడా ఆయనను బతికించుకోలేకపోయారు.