డీమానిటైజేషన్ అన్నారని రిషి వేసేశాడుగా

Update: 2016-12-29 19:30 GMT
తనకు అనిపించినవాటిని తోచిన వాటిని ఏ మాత్రం ఆలోచించకుండా సోషల్ మీడియాలో పెట్టేసే అతి కొద్ది మందిలో బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ కూడా ఉంటారు. ఈయన తాజాగా ఓ కామెంట్ చేశారు. 'తమ ఫెయిల్యూర్ కి డీమానిటైజేషన్ ను కారణంగా చూపారు ఆ ఫిలిం మేకర్స్. దంగల్ గురించి చెప్పండి. ఇలాంటి టైమ్ లో 350 కోట్లు వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు వస్తున్నాయ్ కదా' అంటూ ట్వీట్ పెట్టారు రిషి కపూర్.

రిషి ఆ సినిమా పేరు చెప్పకపోయినా ఇది రాక్ ఆన్2 ఫెయిల్యూర్ గురించి చేసిన ట్వీట్ అనే విషయం అర్ధమవుతూనే ఉంది. ఆయన ట్వీట్ లో కొంత వాస్తవం ఉండొచ్చు కానీ.. మరీ ఇంత దారుణంగా బ్లేమ్ చేసే ముందు కాస్తయినా వాస్తవాలను పరిశీలిస్తే బాగుండేదేమో. డీమానిటైజేషన్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన రెండు రోజులకే రాక్ ఆన్2 విడుదలైంది. నవంబర్ 8 రాత్రి అనౌన్స్ మెంట్.. 9వ తేదీ బ్యాంకుల బంద్.. 11 వ తేదీ రిలీజ్.. ఆ సమయానికి జనాలందరిలోనూ విపరీతమైన టెన్షన్.. భయం.

ఆ పరిస్థితి దాటి ఇప్పటికి 50 రోజులు గడిచాయ్. బ్యాంకుల్లో నగదు కొరత కథలో కూడా చాలానే మార్పులు వచ్చాయి. మొదట్లో ఉన్నంత దారుణంగా పరిస్థితి లేదు. ఇంకా ఇబ్బందులు కొనసాగుతున్నా.. బ్యాంకుల ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నుంచోవాల్సిన పరిస్థితి అయితే లేదు. అంటే సిట్యుయేషన్ కొంత సెట్ అయిందనే విషయం అర్ధం చేసుకోవాలి. అయినా మరీ రిషీ కపూర్ .. అర్జున్ రాంపాల్ సినిమాకి.. ఆమిర్ ఖాన్ సినిమాకి కంపేరిజన్ అంటే దారుణం. నిజంగా ఆమిర్ ఖాన్ మూవీ అదే నవంబర్ 11 విడుదలై ఉంటే.. ఇంతగా కలెక్షన్స్ వచ్చేవా.. దీనికి రిషి కపూర్ ఆన్సర్ చేయగలడా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News