బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మొన్నమధ్యన పీపుల్స్ ఛాయిస్ అవార్డు గెలవడంతో వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయింది. అమెరికన్ సీరియల్ ‘క్వాంటికో’లో పనిచేస్తూ.. ఆ సీరియల్ కోసం ముద్దుల నుండి స్విమ్ సూట్ల వరకు అన్నింటా రెచ్చిపోవడంతో.. బీభత్సంగా పాపులర్ అయ్యింది. కట్ చేస్తే.. అంతే స్పీడుగా ఇప్పుడు ఓ వివాదంలో అమ్మడి పేరు మారుమ్రోగుతోందంతే.
మిస్ ఇండియా.. మిస్ వరల్డ్ కిరీటాలు అందుకుని.. 2003లో ‘ది హీరో’తో తెరంగేట్రం చేసి మంచి నటిగా, గాయనిగాకూడా పేరుతెచ్చుకున్న ప్రియాంక చోప్రాకి పరువు పోయినంత పనైంది. ‘పెబ్బుల్స్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ స్థాపించి నిర్మాతగా మారి తనే హీరోయిన్ గా మధుర భండార్కర్ దర్శకత్వంలో ‘‘మేడంజీ’’ సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రియాంక, గత ఏప్రిల్ నెలలో ఒక టివి యాడ్ కోసం జరిపిన షూటింగ్ తాలూకు బకాయి ఇంకా పే చేయలేదట. ప్రొడక్షన్ సిబ్బందికి రోజు వారీ పారితోషికం అంతా కలిపి 36 లక్షల రూపాయలు చెల్లించాల్సి వుండగా, వారికి 20 లక్షలు మాత్రమే చెల్లించిందట ప్రియాంక. బ్యాలెన్స్ చెల్లించకపోవడంతో స్టూడియో సెట్టింగ్ మజ్దూర్ యూనియన్ తరఫున ప్రధాన కార్యదర్శి గంగేశ్వర్ శ్రీవాత్సవ్ ప్రియాంకకు నోటీసులు పంపాడు. ఆ నోటీసులకు స్పందన రాలేదు. అందుకే ఇప్పుడు ఏకంగా పేపర్లో యాడ్ ఇచ్చేసి ప్రియాంకను డీఫాల్టర్ గా నిలబెట్టాడు.
డైలా వేజ్ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడం అన్యాయం అంటూ నిలదీశాడు. ఒక్కసారిగా బాలీవుడ్ కూడా ఈ యవ్వరాం చూసి షాకైంది. కేవలం 31 రాత్రిన కాలు కదిపితేనే 6 కోట్లు తీసుకున్న ప్రియాంక.. ఇలా 16 లక్షల ఎగ్గొట్టడం ఏంటి విడ్డూరం కాకపోతే? అయితే ప్రియాంక ప్రతినిధి స్పందిస్తూ ‘‘ఆ యాడ్ కోసం సెట్ డిజైనర్ తో కాంట్రాక్టు మాట్లాడాం. కాబట్టి బకాయిలు ఆ కళాదర్శకుని వద్దనుంచే వసూలు చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ప్చ్.. వాటే ట్విస్టు గురూ.