మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఈ వయసు లో కూడా వరుసగా సినిమాలు చేయడంతో పాటు సక్సెస్ లు దక్కించుకుంటూ అందరిని ఆశ్చర్యపర్చుతూ ఆకట్టుకుంటూ ఉన్న మమ్ముట్టీ మరోసారి అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు గాను క్రిస్టోఫర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాకు ఉన్ని కృష్ణన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. మమ్ముట్టీ తాజాగా ఈ సినిమా గురించి షేర్ చేసిన పోస్ట్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. సినిమాలో విలన్ గా వినయ్ రాయ్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆయనకు మొదటి మలయాళి సినిమా ఇది.
చాలా స్టైలిష్ లుక్ లో వినయ్ రాయ్ ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. సాదారణంగానే చాలా స్టైల్ గా కనిపించే వినయ్ రాయ్ ని అంతకు మించి స్టైలిష్ లుక్ లో క్రిస్టోఫర్ సినిమా లో దర్శకుడు ఉన్ని కృష్ణన్ చూపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.
మమ్ముట్టీ.. వినయ్ రాయ్ తో పాటు ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి.. అమలా పాల్.. స్నేహా.. షైన్ టామ్ చాకో మరియు జిను జోసెఫ్ లు నటించబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మలయాళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.