పాన్ ఇండియా -బాహుబలితో కట్టప్ప గా సత్యరాజ్ కు దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. తమిళ్ -తెలుగు సహా అన్నిచోట్లా సత్యరాజ్ కు అవకాశాలు పెరిగాయంటే కట్టప్ప క్రేజు వల్లనే. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడిగా సత్యరాజ్ పేరు మార్మోగుతోంది. సత్యరాజ్ కి ప్రత్యేకించి అభిమానులున్నారు. ఇప్పుడు ఆ క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. సత్యరాజ్ ప్రధాన పాత్రలో `తీరపుగ విర్కపాదం` అనే థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ధీరన్ దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు.
తెలుగులో ఎమెర్జీనీ టైటిల్ తో అనువాదమై ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మారుతి ట్విటర్ ద్వారా విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియమైన సత్యరాజ్ గారు నటించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తన చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషం గా ఉందని యూనిట్ కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ లుక్ లో సత్యరాజ్ లోని ఈజ్ ఆకట్టుకుంటోంది. చైర్ లో కూర్చొని తీక్షణంగా చూస్తూ...సీరియస్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. `ఏ ఫాదర్ రివేంజ్` అని పోస్టర్ లో రివీల్ చేయడంతో..ఇదొక రివేంజ్ డ్రామా అని తెలుస్తోంది.
టైటిల్ క్యూరియా సిటీని పెంచుతోంది. ఎమర్జెన్సీ కి సరైన జస్టిఫికేషన్ ఏమిటన్నది తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు సత్యరాజ్ ఏకంగా 12 గంటలు డబ్బింగ్ చెప్పి రికార్డు సృష్టించారు. ఏకధాటిగా ఇన్ని గంటల పాటు కూర్చొని డబ్బింగ్ చెప్పడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో ఓపిక సహనం ఉండాలి. అవన్నీ కట్టప్ప లో కావాల్సినంత ఉన్నాయని ఈ సన్నివేశం చెబుతోంది. ఈ చిత్రాన్నీ సజీవ్ మీరా సాహెబ్ రాథర్ నిర్మిస్తున్నారు. సమ్మర్ లో సినిమా రిలీజ్ కానుంది.