ఫస్ట్‌ టైమ్‌.... నెక్లస్ రోడ్‌ లో భీమ్లా ఇప్పుడు హడావుడి

Update: 2022-03-26 07:01 GMT
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యి నెల రోజులు దాటి పోయింది. భారీగా వసూళ్లను దక్కించుకుని పవన్‌ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్‌ మూవీగా నిలిచింది. పవన్ కళ్యాణ్ మరియు రానాల మద్య సాగే వైరం.. భారీ యాక్షన్ సన్నివేశాలు ఇంకా ఎమోషనల్‌ సన్నివేశాలతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కొన్ని వివాదాలు చుట్టుముట్టినా కూడా భారీ గా వసూళ్లను దక్కించుకోవడంతో భీమ్లా నాయక్‌ ఈ ఏడాది మేటి చిత్రాల జాబితాలో నిలిచింది.

థియేట్రికల్‌ రన్‌ పూర్తి అయిన భీమ్లా నాయక్ ను ఇటీవలే ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ చేసిన విషయం తెల్సిందే. ఈ రెండు ఓటీటీ లు కూడా సంయుక్తంగా ఈ సినిమాను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. సినిమా చిత్రీకరణ సమయం నుండే ఉన్న అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో హడావుడి చేశారు. ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతుంది కనుక కాస్త హడావుడి తగ్గాలి. కాని అనూహ్యంగా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు హడావుడి చేస్తున్నారు.

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్‌ చేయడం మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన హోర్డింగ్‌ లను ఏర్పాటు చేస్తూ సరికొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు.

తాజాగా నెక్లస్ రోడ్‌ లో విభిన్నమైన కటౌట్‌ ను ఏర్పాటు చేసి సరికొత్తగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఓటీటీ వారు ఇలా ప్రమోట్‌ చేసిందే లేదు. తెలుగు లో రెండు ఓటీటీ లు కలిసి ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేశాయి కనుక హడావుడి చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా ఇలా ఓటీటీ వారు కటౌట్‌ పెట్టిన దాఖలాలు లేవు. మొదటి సారి భీమ్లా నాయక్ కు కటౌట్‌ ను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు కటౌట్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే భారీ గా భీమ్లా నాయక్‌ ను రెండు ఓటీటీ ల్లో కూడా జనాలు చూశారు. అత్యధిక రన్ టైమ్‌ ను దక్కించుకున్న సినిమా గా ఆహా లో భీమ్లా నాయక్ నిలిచిందని అంటున్నారు.

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో కూడా భారీగా ఈ సినిమా ను చూస్తున్న నేపథ్యంలో మరింత మంది ఈ సినిమాను చూసే విధంగా ఓటీటీ వారు ఇలాంటి ఒక ప్రయత్నం చేశారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్‌ హోర్డింగ్‌ ను చూసేందుకు పవన్‌ అభిమానులు నెక్లస్ రోడ్డుకు బారులు తీరారు. అటుగా వెళ్తున్న వారు ఆగి మరీ ఆ కటౌట్‌ ను చూసి ఫోటోలు తీసుకుంటున్నారట.
Tags:    

Similar News