పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ టాప్ స్టార్. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే.. పవన్ సినిమా స్టార్ కన్నా.. బలమైన వ్యక్తిత్వం కలవాడని అంటూ ఉంటారు. ఇప్పటికే పలువురు సహ నటులు పలుమార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా.. నటుడు ఫిష్ వెంకట్ పవన్ బిహేవియర్ గురించి స్పందించారు.
భారీ స్టార్ డమ్ ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి మాట్లాడడం తాను ఇప్పటి వరకూ చూడలేదని అన్నారు. స్థాయిబేధం లేకుండా ఆయన ఎవరినైనా గౌరవంగా సంబోధిస్తారని చెప్పారు. చిన్న టెక్నీషియన్ కు సైతం పెద్ద విలువ ఇచ్చి మాట్లాడుతారని అన్నారు.
“పవన్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అభ్యంతకర భాషను ఉపయోగించడాన్ని నేను ఇప్పటి వరకూ చూడలేదు. ఆయన అందరినీ గౌరవిస్తారు. నన్ను కూడా అన్న అని పిలుస్తారు. లేదంటే.. వెంకట్ గారు అని పిలుస్తారు’’ అని ఫిష్ వెంకట్ చెప్పారు.
పవన్ తో కలిసి ఫిష్ వెంకట్ సుమారు ఆరు చిత్రాల్లో నటించారు. అయితే.. ఎక్కువగా గుర్తుండిపోయే చిత్రం మాత్రం.. ‘గబ్బర్ సింగ్’. అందులోని అంత్యాక్షరి ఎపిసోడ్ ను ప్రేక్షలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ సీన్ షూట్ అయిపోయిన తర్వాత అందరినీ ఇంటికి ఆహ్వానించాడట పవన్. తన ఫామ్ హౌస్ లో పండిన తాజా పండ్లను వాళ్లకు అందజేశాడని గుర్తు చేసుకున్నారు ఫిష్ వెంకట్.