థియేటర్లు దొరక్క విలవిలలాడుతున్న చిన్న సినిమాలకు మేలు చేసేలా.. వాటికి కూడా మొత్తంగా థియేటర్లు దొరక్కపోయినా - కనీసం ఒక షో అయినా దొరికేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. థియేటర్లలో రోజుకు అయిదు షోలు వేసేందుకు అనుమతి ఇస్తూ త్వరలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమ ప్రస్థానం - పరిపాలనపై ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన పుస్తకాన్ని తలసాని హైదరాబాద్ లో ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. అతేకాదు.. హైదరాబాద్ లోని ప్రధాన బస్టాండ్లలో మినీ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు కూడా తలసాని తెలిపారు.
రోజుకు అయిదు షోలు వేయాలన్న ఆలోచన చాలాకాలంగా ఉంది. గత ఏడాది కూడా పలు మార్లు ప్రభుత్వం దీనిపై మాట్లాడింది. అంతేకాదు.. గత ఏడాది తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఉప సంఘాన్ని కూడా వేసింది. ఆ ఉప సంఘం సిపార్సుల్లో ఈ విషయం కూడా ఉంది. దీనికి ప్రభుత్వం అప్పటి నుంచి కూడా సానుకూలంగానే ఉన్నా ఇంతవరకు అమలు కాలేదు. ఇప్పుడు త్వరలో జీవో రానుండడంతో త్వరలో ఇది నిజం కానుందని తెలుస్తోంది.
రోజుకు అయిదు షోలు అన్నది అమల్లోకి వస్తే.. సినిమా హాళ్ళలో మార్నింగ్ షోలు ఇప్పటిలా ఉదయం 11 లేదా 11.30 గంటల మాదిరి కాక ఉదయం 10 గంటలకే మొదలవుతాయి. మ్యాట్నీ షో మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం షోలు 4 గంటలకు, రాత్రి తిరిగి 7, సెకండ్ షో రాత్రి 10 గంటలకు మొదలవుతాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాత్రి 12-30 గంటలకల్లా పూర్తవుతాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/