మరీ కామెడీగా ఉంది పవన్

Update: 2016-03-12 17:30 GMT
మొన్నేమో రెండు లొకేషన్లలో రెండు యూనిట్లు పని చేస్తున్నాయ్.. ఒకచోట పాట తీస్తున్నారు.. ఇంకోచోట ఫైట్ తీస్తున్నారు అన్నారు. ఆ తర్వాత లొకేషన్లు మూడుకు పెరిగాయి. ఒకేసారి మూడు చోట్ల షూటింగ్ జరుగుతోందని.. పవన్ అటు ఇటు రౌండ్లు కొడుతున్నాడని.. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడేమో ఏకంగా ఐదు లొకేషన్లు-ఐదు యూనిట్లు అంటూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించి లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ లీకులిస్తున్నది ‘సర్దార్..’ యూనిట్ సభ్యులే కావడం విశేషం. అయినా ఒక సినిమా షూటింగ్ ఒకేసారి ఐదు లొకేషన్లలో చేయడం సాధ్యమా.. అయినా అంత అవసరం ఏమొచ్చేసింది.. అన్నదే అర్థం కావడం లేదు. నిజంగా ఐదు యూనిట్లతో షూటింగ్ చేస్తే.. సినిమా మొత్తం రెండు మూడు వారాల్లో అవగొట్టేయొచ్చు.

అయినా ఐదు లొకేషన్లలో షూటింగ్ అంటే వాటిని డైరెక్ట్ చేసేది ఎవరు.. పర్యవేక్షించేది ఎవరు.. అసలా సన్నివేశాలు ఎలా వస్తున్నాయి.. ఐదు రకాల సన్నివేశాల్ని ఎవరెవరిపై తీస్తున్నారు? పవన్ ఎక్కడుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? డైరెక్టర్ బాబి ఎక్కడున్నాడు?.. ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. ఇదంతా వాస్తవమే అనుకున్నా.. ఇప్పుడు ఈ స్థాయిలో పని చేస్తున్నవాళ్లు ఆర్నెల్లుగా ఏం చేస్తున్నట్లు? ఎంత భాగం షూట్ చేసినట్లు? అన్నది క్లారిటీ లేదు అయినా సంక్రాంతికి అయితే.. పండగ తేదీ మారాక సీజన్ దొరకదన్న ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలా హడావుడి పడితే అర్థముంది. కానీ సమ్మర్ విషయంలో ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. ఏప్రిల్ 8 కాకపోతే.. వారమో రెండు వారాలో వాయిదా వేసుకోవచ్చు కదా. అయినా ఇంత హడావుడి ఎందుకు పడుతున్నట్లో?
Tags:    

Similar News