కొత్తవాళ్లకి నేను రోల్ మోడల్ అయితే చాలు!

Update: 2020-05-30 09:10 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ సినిమా ద్వారా పరిచయమైన బెంగళూరు భామ అనుష్క శెట్టి. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుష్క. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. కానీ బాహుబలి సినిమా తర్వాత అనుష్క కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. బాహుబలి తర్వాత భాగమతి సినిమా చేసినా.. అది బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అనుష్క టాప్ హీరోయిన్ కావచ్చు.. కానీ ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా ఒక్క ప్లాప్ పడేసరికి చతికిల పడిపోవాల్సిందే. కాకపోతే కొందరు హీరోయిన్లు ఎలాంటి ఆలస్యం చేయకుండా హిట్ కొట్టి మళ్లీ తిరిగి పూర్వ వైభవాన్ని పొందడానికి ట్రై చేస్తుంటారు. ఇక భాగమతి ఫెయిల్యూర్ తో.. భారీ గ్యాప్ తీసుకున్న స్వీటీ సోలోగా భారీ హిట్టు కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గత కొన్నేళ్లుగా సౌత్ సినీ ఇండస్ట్రీలో కొత్త నీరు వచ్చి పాత నీరు కనబడకుండా పోతుంది. అలా కనిపించకుండా పోతున్న పాత నీరులిస్టులో చేరింది అనుష్క.

బాహుబలితో మరో రేంజ్ గుర్తింపు వచ్చిన తర్వాత మళ్లీ తక్కువ స్థాయి క్యారెక్టర్లు చేస్తే కెరీర్ క్లోస్ అవుతుందని.. మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేసింది. నిజానికి బాహుబలి తర్వాత చిన్న సినిమాల దర్శక నిర్మాతలు ఆమెను కలవడమే మానేశారు. అయితే తాజాగా మరోసారి లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'నిశ్శబ్దం' చేస్తుంది. త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ఇక తన కెరీర్ తో పాటు.. ప్రస్తుతం కొత్త హీరోయిన్లను ఉద్దేశించి తన అభిప్రాయం తెలిపింది. "నేను ఎన్ని సినిమాలు చేశాను.. ఎలాంటి సినిమాలు చేశాను.. అనే విషయాలు పక్కన పెడితే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోయిన్లకు, రాబోతున్న హీరోయిన్లకు నేను.. నేను చేసిన క్యారెక్టర్లు రోల్ మోడల్ గా నిలిస్తే చాలు. నేను ఫుల్ హ్యాపీ" అనే విధంగా మనసులో మాటలు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా స్వీటీ ప్రస్తుతం ఓ మంచి సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తుంది. మరి నిశ్శబ్దం సినిమాతో ఆ హిట్ అందుకుంటుందో లేదో అనేది చూడాలి!
Tags:    

Similar News