నాగార్జున సినిమా టీంలో అంతర్ఘత విభేదాలు

Update: 2020-11-03 05:10 GMT
బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ నటిస్తుండటంతో పాటు టాలీవుడ్‌ స్టార్‌ అయిన నాగార్జున కూడా నటిస్తున్నాడు. దాంతో అక్కడ ఇక్కడ కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. సినిమా ఆరంభం అయ్యి దాదాపుగా రెండేళ్ల అయ్యింది. ఏదో ఒక కారణం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని భావించారు. కాని కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ కు వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. నిర్మాణ సంస్థ ఫాక్‌ స్టార్‌ వారికి దర్శకుడు అయాన్‌ ముఖర్జీతో వివాదం ఏర్పడింది. సినిమాను మూడు గంటలకు పైగా నిడివితో చిత్రీకరించేందుకు స్క్రిప్ట్‌ ను రెడీ చేశారు. ఇప్పటికే ఆలస్యం అవ్వడంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల సినిమాను రెండున్నర గంటలకు కుదించాలంటూ దర్శకుడికి ఫాక్‌ స్టార్‌ వారు సూచించారు. అందుకు దర్శకుడితో పాటు సహ నిర్మాత అయిన కరణ్‌ జోహార్‌ కూడా నో చెప్పాడట. ఖచ్చితంగా ఈ కథను మూడు గంటల నిడివితో చూపించాల్సిందే. అలా చూపిస్తేనే ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది.

ఇంత మంది నటీనటులతో సినిమా తీసి రెండున్నర గంటలే సినిమాను ఆడిస్తే ఏ ఒక్క పాత్రకు కూడా పూర్తి న్యాయం చేసినట్లుగా ఉండదు అంటూ కరణ్‌ జోహార్‌ మరియు దర్శకుడు అయాన్‌ అంటున్నారట. ఈ క్రియేటివ్‌ విభేదాల కారణంగా సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. మళ్లీ ప్రారంభం అయ్యేనా లేదంటే అసలుకే సినిమా అటకెక్కనా అంటూ బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్‌ లో చర్చ జరగుతుంది. నాగార్జున 17 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌ సినిమా చేస్తున్నాడు అంటూ ఆనందంగా అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తలతో వారు ఉసూరుమంటున్నారు.
Tags:    

Similar News