నటనకు స్కోప్ ఉన్న విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్ లో అవకాశాలు కొల్లగొడుతున్న తాప్సీ కొత్త సినిమా గేమ్ ఓవర్. దీని ట్రైలర్ ఇందాకే రిలీజైంది. కథ విషయానికి వస్తే ఇంట్లో పనిమనిషి తప్ప ఇంకే తోడు లేని ఒక ఒంటరి యువతీ(తాప్సీ) విచిత్రమైన భయాలతో అనూహ్య సంఘటనలు ఎదురుకుంటూ ఉంటుంది. డాక్టర్ ఇది ఏడాదికి ఒకసారి వచ్చే ఓ వింత మానసిక జబ్బుగా నిర్ధారిస్తాడు. అయినా తన కష్టాలు అక్కడితో ఆగిపోవు.
దెయ్యాల జాడలు తెలుస్తాయి. ఈలోగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళ తలలను తీసి శరీరాలను కాల్చివేసే ఓ సైకో కిల్లర్ గురించి టీవీలో చూస్తుంది ఆ యువతీ. కట్ చేస్తే తన ఇంట్లో అతని చేతిలోనే చంపబడే ప్రమాదకర పరిస్థితిలో ఇరుక్కుంటుంది. అసలు ఇదంతా ఏమిటి ఎవరు ఎవరితో గేమ్ ఆడారో సినిమాలో చూడాలి
ట్రైలర్ లో థీమ్ ని క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అనురాగ్ కశ్యప్ సమర్పణ అంటే అతన్ని ప్రత్యేకంగా అభిమానించే ప్రేక్షకులు గేమ్ ఓవర్ నుంచి చాలా ఆశిస్తారు. కాని మేకింగ్ తో పాటు సినిమాటోగ్రఫీ కొంచెం క్వాలిటీ లోపాలతో కనిపిస్తున్న కారణంగా ఇది అంత గొప్ప గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా నిలుస్తుందా అనే అనుమానం కలుగుతుంది.
దర్శకుడు అశ్విన్ శరవనన్ టేకింగ్ లో మరీ కొత్తదనం లేదు. అనీష్ కురువిల్లా తప్ప ఇంకే ఆర్టిస్టులు కనిపించలేదు. వసంత్ ఛాయాగ్రహణం రాన్ ఎతన్ యోహన్ సంగీతం దీనికి తగ్గట్టే ఉన్నాయి. ట్రైలర్ కోణంలో చూస్తే మరీ ఎగ్జైటింగ్ గా అనిపించని ఈ గేమ్ ఓవర్ జూన్ 14న తమిళ తెలుగు బాషలలో కూడా రానుంది
Full View