'ప్రేమమ్' తో హీరోయిన్ గా పరిచయమైన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. తన సహజమైన నటనతో ప్రేక్షకులను 'ఫిదా' చేసింది. అందం అభినయంతో పాటుగా డ్యాన్సులతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల 'విరాటపర్వం' సినిమాలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ''గార్గి'' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తోంది.
సాయి పల్లవి ప్రధాన పాత్రలో గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గార్గి'. తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. ఇప్పటికే విడుదల చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై ఆసక్తిని కలిగించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'గార్గి' ట్రైలర్ ను ఆవిష్కరించారు. తెలుగు ట్రైలర్ ను హీరో నాని మరియు రానా దగ్గుబాటి లాంచ్ చేయగా.. తమిళ ట్రైలర్ ను సూర్య - ఆర్య - అనిరుధ్ - లోకేశ్ కనగరాజ్ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. 'మేడమ్.. బ్రహ్మానందం పెద్ద కూతురు మీరేనా?' అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది. ఇందులో సాయి పల్లవి ఒక టీచర్ గా కనిపించింది. అయితే సడన్ గా ఆమె తండ్రిని అరెస్ట్ చేయడంతో ఒక్క రోజులో వారి జీవితాలే తలక్రిందులు అయినట్లుగా తెలుస్తోంది.
తన తండ్రిని నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి ఓ కూతురు చేసే న్యాయ పోరాటమే ఈ 'గార్గి' సినిమా అని అర్థం అవుతోంది. న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆసక్తిగా సాగింది. 'నువ్వు టైమ్, రాత, విధి.. అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే నేను మగపిల్లాడిని కాదుగా.. ఆడపిల్లను' అని సాయి పల్లవి చెప్పే డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది.
సాయి పల్లవి మరోసారి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. ఆమె తరపున పోరాడే లాయర్ గా కాళీ వెంకట్ మంచి నటన కనబరిచారు. ఐశ్వర్య లక్ష్మీ - జయప్రకాష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.
'గార్గి' చిత్రాన్ని బ్లాకీ జనీ & మై ఫుట్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రవి చంద్రన్ రామచంద్రన్ - ఐశ్వర్య లక్ష్మీ - థామస్ జార్జ్ - గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా దగ్గుబాటి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ భాషల్లో జూలై 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Full View