బ్రేక్ ఈవెన్ కు చేరువగా బాలయ్య

Update: 2017-01-29 07:40 GMT
నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బ్రేక్ ఈవెన్ కు చేరువగా వచ్చింది. ఆ సినిమా ఇంకో ఒక కోటి షేర్ వసూలు చేస్తే లాభాల బాట పట్టేస్తుంది. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే లాభాలు అందుకున్నా.. కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కు రాలేదు. 15వ రోజుకు ఈ చిత్రం రూ.49 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రానికి రూ.50 కోట్ల మార్కు దాటితే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ హిట్ కేటగిరిలోకి వస్తుంది. సీడెడ్ లాంటి ఏరియాల్లో ఈ చిత్రానికి మంచి లాభాలు వచ్చాయి. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం అంచనాల్ని మించి ఆడింది.

15వ రోజుకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఏరియాల వారీగా షేర్ బ్రేకప్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం (తెలంగాణ)- రూ.9.55 కోట్లు

సీడెడ్ (రాయలసీమ)- రూ.7.18 కోట్లు

వైజాగ్ (ఉత్తరాంధ్ర)– రూ.4.65 కోట్లు

గుంటూరు- రూ.4.06 కోట్లు

కృష్ణా– రూ.2.68 కోట్లు

తూర్పు గోదావరి- రూ.3.52 కోట్లు

పశ్చిమగోదావరి– 3.3 కోట్లు

నెల్లూరు- రూ.1.65 కోట్లు
 
కర్ణాటక– రూ. 3.75 కోట్లు

రెస్టాఫ్ ఇండియా– రూ.1.25 కోట్లు

ఓవర్సీస్– రూ.7.2 కోట్లు

మొత్తం– రూ. 49 కోట్లు
Tags:    

Similar News