గురువుపై శిష్యుడి ఆరోపణలు ఏమిటో

Update: 2018-03-28 23:30 GMT
సీనియర్ దర్శకుల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని కోసం రోజు వేల మంది యువకులు ఎదురుచూస్తుంటారు. కొందరిపై అభిమానంతో వస్తే మరికొంత మంది తొందరగా సెట్ అవ్వచ్చని రికమండేషన్ తో దర్శకుల వద్ద జాయిన్ అవుతుంటారు. అయితే ఆ తరహాలో కోలీవుడ్ దర్శకుడైన గౌతమ్ మీనన్ వద్దకు చాలా మంది యువకులు వస్తుంటారు. కానీ ఆయన టాలెంట్ ఉన్నవారినే గుర్తించి చాలా బాగా చూసుకుంటారని పేరుంది.

కానీ ఇటీవల ఆయన దగ్గర గత కొన్నేళ్లుగా పని నేర్చుకున్న ఒక యువ దర్శకుడు మాత్రం గౌతమ్ పైనే వివాదస్పద కామెంట్ చేయడం సంచలనంగా మారింది. గురువంగల్ పతినారు అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆ సినిమాతో లాభాలను అందుకున్న కార్తీక్ నరేన్ తో గౌతమ్ ఒక సినిమా నిర్మిస్తానని ప్లాన్ చేశాడట. అంతే కాకుండా అందులో కార్తీక్ కొంత ఇన్వెస్ట చేయగా ఇప్పుడు సినిమా ఆపేశాడట.

ఈ విషయాన్ని కార్తీక్ సోషల్ మీడియా ద్వారా చెప్పడం సంచలనంగా మారింది. ఈ రేంజ్ లో ఇంతవరకు గౌతమ్ పై ఎవరు కామెంట్స్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ దర్శకుల్లో కొంత మంది గౌతమ్ మీనన్ శిష్యులే. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారని టాక్ ఉంది. మరి అలాంటి దర్శకుడిపై అతని ప్రియ శిష్యుడే ఆ విధంగా స్పందించడం వెనుక కుట్ర ఏముంటుందా అనే కామెంట్స్ వస్తున్నాయి.   
Tags:    

Similar News