గతంలో మాదిరి మొహమాటాలు అస్సల్లేవు. ప్రముఖు నటుడు తనకు తోచినట్లుగా మాట్లాడితే.. మనకెందుకులే అని ఊరుకోవటం లేదు. నచ్చని మాట ఎవరు చెప్పినా సరే.. ఇలా మాట్లాడతారేంటి? అంటూ ప్రశ్నిస్తున్న ధోరణి పెరుగుతోంది. మొహమాటాలకు.. కనిపించని లోగుట్లకు నిలయంగా నిలిచే చిత్ర పరిశ్రమలోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
ప్రముఖ నటులు చేసే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్న వైనం ఇప్పుడు పెరుగుతోంది. తాజాగా బిగ్ బాస్ రియాల్టీ షో తమిళ్ వెర్షన్ లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది నటి గాయత్రీ రఘురాం. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మహిళా కంటెస్టెంట్లు సిగిరెట్లు కాల్చిన వైనంపై కమల్ క్లాస్ తీసుకోవటం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
మగవారు చేసే పనులైన సిగిరెట్లు కాల్చటం.. అసభ్యంగా ప్రవర్తించటం లాంటి అంశాలపై కమల్ స్పందిస్తూ.. ఇలాంటివి ఆడవాళ్లు చేయకూడదన్నట్లుగా మాట్లాడటంపై గాయత్రీ తప్పు పట్టారు. మహిళలు సిగిరెట్లు కాల్చటం వెనుక తాము మగవారి కంటే గొప్పవారిగా భావించటం లేదని.. మగవారి లానే మహిళలు మానసిక ఒత్తిడికి.. మనో వేదనకు గురి అవుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. ట్విట్టర్ లో కమల్ కు ఆమె కౌంటర్ ఇస్తూ.. మగవారిని చూసి మహిళలు కాపీ కొడుతున్నారన్న ధోరణిలో కమల్ మాట్లాడటం సరికాదంటూ మండిపడ్డారు. మరి దీనిపై కమల్ రియాక్షన్ ఏమిటో?