విజయ్ దేవరకొండకు సోలో హీరోగా ఫస్ట్ హిట్ 'పెళ్ళిచూపులు'. ఇక 'అర్జున్ రెడ్డి' మాత్రం విజయ్ ని యూత్ ఐకాన్ గా మార్చేసింది. కానీ ఆ సినిమా హార్డ్ అండ్ బోల్డ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త దూరంగానే ఉన్నారు. కానీ విజయ్ ని అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువ చేసిన చిత్రం 'గీతగోవిందం'. దాదాపు 70 కోట్ల రూపాయల షేర్ సాధించి టాప్ లీగ్ స్టార్స్ కు మాత్రమే చోటు దక్కే లిస్టు లో కి ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు దేవరకొండ.
ఈమధ్య 'గీత గోవిందం' చిత్రాన్ని జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేశారు. ఈ సినిమాకు 20.7 టెలివిజన్ వ్యూయర్ షిప్ రేటింగ్స్(TVR) వచ్చాయని సమాచారం. ఇది అలాంటిలాంటి రేటింగ్ కానే కాదు. రామ్ చరణ్-సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం 'రంగస్థలం' టీవీఆర్ కంటే ఎక్కువ. 'రంగస్థలం' సినిమాను స్టార్ మా వారు ఈమధ్యనే ప్రసారం చేయగా 19.5 రేటింగ్ వచ్చింది. 'బాహుబలి' సినిమాల తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం 'రంగస్థలం'. అలాంటి సినిమాకు వచ్చిన టీవీ రేటింగ్స్ కంటే ఎక్కువ రేటింగ్స్ ను నమోదు చేయడం అంటే ఈ సినిమా బుల్లి తెరపై కూడా దుమ్ము లేపినట్టే.
ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమా కావడం.. ఎంటర్టైనర్ కావడం.. ఆపైన విజయ్ దేవరకొండ క్రేజ్ అన్నీ కలిపి 'గీతగోవిందం' ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యేందుకు కారణం అయిఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.