నిజంగా మహవీర్ పొగట్ జీవితంలో ఎంత ఎమోషన్ ఉందో ఏమో కానీ.. ‘దంగల్’ సినిమాలో మాత్రం ఎమోషన్లను అద్భుతంగా పండించేశారు. ఈ సినిమా చూసి సామాన్య ప్రేక్షకులే ఉద్వేగానికి గురయ్యారు. ఇక మహవీర్ పొగట్ కుటుంబ సభ్యులు మరింతగా ఉద్వేగానికి లోనవడంలో ఆశ్చర్యమేమీ లేదు. మహవీర్ పెద్ద కూతురు గీత.. సినిమాలో తన పాత్రను.. దాని చుట్టూ తిరిగే సన్నివేశాలను చూసి తీవ్ర భావోద్వేగానికి గురైందట. ముఖ్యంగా ఒక సన్నివేశం చూసి తాను కన్నీళ్లు పెట్టేసుకున్నానని.. అసలు తనకు ఆ సన్నివేశం నచ్చలేదని గీత తెలిపింది. ఇంతకీ ఆ సీన్ ఏదంటే..
అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఓటమి పాలై వచ్చాక తండ్రిని కలిసినపుడు అతను మందలిస్తాడు. దీంతో గురువైన తండ్రితోనే కుస్తీకి సిద్ధమైపోతుంది గీత. అమీర్ ఖాన్.. సనా షేక్ మధ్య వచ్చే ఈ సన్నివేశం చూసి తాను వేదనకు గురైనట్లు.. ఏడ్చేసినట్లు గీత వెల్లడించింది. వాస్తవానికి తాను తన తండ్రితో ఒక్కసారి మాత్రమే తలపడ్డానని.. అంతటితో విషయం ముగిసిపోయిందని.. ఐతే సినిమాలో నాటకీయత పెంచేసి తాను తండ్రితో కాస్త కఠినంగా వ్యవహరించినట్లు చూపించారని గీత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐతే మొత్తంగా తాను ఈ సినిమాను బాగా ఆస్వాదించానని తెలిపింది. చాలా సహజంగా ఇందులో కుస్తీ సన్నివేశాలు చిత్రీకరించారని ఆమె ప్రశంసించింది. తమ జీవితాల్ని తెరమీద చూసుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా గీత తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/