తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ మూడవ వారం ముగింపు దశకు వచ్చింది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా అడవిలో ఆట రెండు రోజుల పాటు సాగింది. ఆట ముగిసే సమయంకు దొంగల టీమ్ మెంబర్స్ ఓడిపోగా పోలీసుల టీమ్ మెంబర్స్ అధిక బొమ్మలను కలిగి ఉండటంతో కెప్టెన్సీ పోటీ దారులు గా నిలిచారు. ఇక కన్నింగ్ వ్యాపారవేత్తగా గీతూ రాయల్ మంచి ప్రతిభ కనబర్చింది.
ఆమె ఆట తీరుకు అంతా షాక్ అయ్యారు. నా ఇష్టం వచ్చినట్లుగా ఆడుతాను.. ఇలా అడకూడదు అని ఏమీ లేదు అన్నట్లుగా బిగ్ బాస్ టీమ్ కూడా నోరు వెళ్లబెట్టే విధంగా ఆటను కొత్త రీతికి తీసుకు వెళ్లింది. ఆమె ఆట ముగిసే సమయంకు 51 బొమ్మలను ఆదా చేయగలిగింది. అంతే కాకుండా తన వద్ద 15800 డబ్బును కూడా మిగుల్చుకుంది. డబ్బును అంతగా దాచుకోవడంతో ఆమెకు కెప్టెన్సీ పోటీదారుగా ఛాన్స్ దక్కింది.
కెప్టెన్సీ పోటీ మొదటి రౌడ్ కు పోలీసుల టీమ్ కు చెందిన ఆది రెడ్డి.. ఫైమా లు ఎంపిక అవ్వగా గీతూ రాయల్ కి ఛాన్స్ దక్కింది. దొంగల టీమ్ లో ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన శ్రీహాన్ కి కూడా కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచే అవకాశం దక్కింది. ఇక గోల్డెన్ కోకోనట్ ఉండటం వల్ల శ్రీ సత్యకి కూడా కెప్టెన్సీ పోటీలో నిలిచే అవకాశం దక్కింది.
కెప్టెన్సీ పోటీదారులు పిరమిడ్ కట్టాల్సి ఉంది. వాటిని ఇతర కంటెస్టెంట్స్ కూల్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటే వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. మొదట గీతూ రాయల్ తన పిరమిడ్ ను కాపాడుకోలేక పోవడంతో బయటకు వెళ్లి పోయింది. ఆ తర్వాత ఫైమా కూడా పిరమిడ్ నిర్మాణం తర్వాత కాపాడుకునేందుకు పట్టుకుంది అంటూ సంచాలక్ రేవంత్ ఆమెను తప్పించాడు.
దాంతో కెప్టెన్సీ రెండవ రౌండ్ కి శ్రీహాన్ శ్రీ సత్య మరియు ఆదిరెడ్డి లు పోరాటంకు సిద్ధం అయ్యారు. నేటి ఎపిసోడ్ లో రాబోయే వారం కెప్టెన్ ఎవరు అనే విషయం క్లారిటీ రాబోతుంది. ఈ ముగ్గురిలో శ్రీహాన్ కాస్త దూకుడుగా పోరాటం చేసే అవకాశం ఉంది. కనుక కచ్చితంగా శ్రీహాన్ లేదంటే ఆదిరెడ్డికి ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక ఆట మధ్యలో ఇనయా మరియు శ్రీహాన్ మధ్య గొడవ జరిగింది. ఫైమా మాదిరిగానే శ్రీహాన్ కూడా టచ్ చేశాడు అంటూ ఇనయా సంచాలక్ కి ఫిర్యాదు చేసింది. అప్పుడు శ్రీహాన్ కాస్త వెటకారంగా పిట్ట కూతలు నమ్మకు అన్నట్లుగా రేవంత్ తో అన్నాడు. ఆ మాటలకు ఇనయా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిట్ట అంటావా అంటూ రెచ్చి పోయింది. ఆ సమయంలో ఫైమా కూల్ చేసేందుకు ప్రయత్నించింది.. ఆ గొడవ కాస్త చివరకు కాస్త లైట్ గా మారిపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.