టాలీవుడ్ లో హహ్హ హాసిని అంటే ఇప్పుడే కాదు ఎప్పటికి గుర్తొచ్చే హీరోయిన్ జెనీలియా మాత్రమే. తెలుగు తమిళ హిందీ మలయాళం మరాఠీ ఇలా దాదాపుగా ఎనిమిది బాషలలో నటించిన ఘనత జెనీలియాకు దక్కుతుంది. ఏ భాషలో ఎన్ని చేసినా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మాత్రం తెలుగు బాషలోనే.. తమిళ డబ్బింగ్ సినిమా బాయ్స్ తో తెలుగులో మొదటిసారి కనిపించిన జెన్నీ.. ఆ తర్వాత రాజమౌళి సై సినిమాలో మెరిసింది. ఇక బొమ్మరిల్లు సినిమాలో హహ హాసిని.. పాత్రతో జెన్నీ అందరికి మోస్ట్ వాంటెడ్ అయింది. ఒకప్పుడు వరస సినిమాలతో ఊపు ఊపేసిన జెన్నీ.. ఆ తర్వాత రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని గృహిణిగా సెటిల్ అయింది. పెళ్ళి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.
చాలా కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెప్పేసింది. ఇక పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యింది జెన్నీ. అయితే ఇటీవల మళ్లీ బ్యూటీకి సినిమాలపై ధ్యాస మళ్లినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం భర్త రితేష్ నటిస్తున్న సినిమాలకు నిర్మాతగా ఉన్న జెనిలియా త్వరలోనే నటిగా మళ్లీ తెరపై కనిపించబోతుందట. ఇక నిన్న రామ్ బర్త్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది జెన్నీ.. "డియర్ రామ్.. ఈ స్టిల్ రెడీ సినిమాలోనిది. ఈ ఫోటో ఎందుకు షేర్ చేస్తున్నానంటే.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు నవ్వులే కాకుండా ఎంతో మంచి వ్యక్తులను కలిశాము. కానీ ఇప్పుడు అవేం లేవు. కాని అప్పటి జ్ఞాపకాలు అలానే ఉన్నాయి. నువ్ నా మంచి స్నేహితుడివి.
మనం రోజు టచ్‌లో లేకున్నా.. మనం ఎక్కడ ఆగామో అక్కడ మొదలు పెట్టొచ్చు. మీ ప్రేమకు నా కృతజ్ఞతలు" అంటూ రెడీ సంగతులని గుర్తుచేసుకుంది జెన్నీ బ్యూటీ. ఇక తాజాగా మళ్లీ సినిమాలలోకి రావాలని అనుకుంటే మాత్రం.. జెన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే.. జెన్నీని అక్క, చెల్లి, వదిన క్యారెక్టర్లలో ఫ్యాన్స్ ఒప్పుకోరని టాక్. ఇద్దరు పిల్లల తల్లి అయినా.. ఇంకా జెన్నీ ఫిజిక్ హీరోయిన్ లాగే మెయింటైన్ చేస్తుంది. బాగా గ్యాప్ వచ్చింది కాబట్టి ఎలాగో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వరని వినికిడి. అసలు ఎలా రానుందో అని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.