ప్రస్తుతం కరోనా అనే మాట వినిపిస్తేనే దేశంలో ప్రజలు చిగురుటాకులా వణుకుతున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి దేశ ఆర్ధికవ్యవస్థ పై తీవ్రమైన ప్రభావం చూపింది. ఇప్పటికే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి నిబంధనల మేరకు.. దేశంలో రాకపోకలు, బస్సులు ఇలా అన్ని సర్వీసులు ఎక్కడిక్కడ స్థంభించి జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కరోనా మహామ్మారితో పోరాడుతూ ప్రతిరోజూ లక్షల్లో బాధితులు - వేలసంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఎంతోమంది వైద్యులు పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ శక్తి మించి పనిచేస్తున్నారు.
తాజాగా ఈ వైరస్ మహామ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన నియోజకవర్గ బాధితులకు నేడు అగ్రసినీనటుడు - ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ నుండి 20లక్షలు విలువైన కరోనా మెడిసిన్ - కిట్స్ పంపించినట్లు సమాచారం. ఇంతకుముందు ప్రపంచంలో ఇలాంటి కల్లోల పరిస్థితిని ఎప్పుడు చూడలేదు. కరోనా మహామ్మారి వలన ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్లిష్టసమయంలో అందరూ బాధ్యతాయుతంగా మెలగాలని ఇదివరకే బాలయ్య పిలుపునిచ్చాడు. తాజాగా బాలకృష్ణ సమాజం కోసం, తన హిందూపూర్ నియోజకవర్గం కోసం తన వంతు కృషి చేస్తున్నారు.
అలాగే హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని కూడా చూసుకుంటున్నాడు. తమ పార్టీ నేతల సహకారంతో ఈరోజు హిందూపూర్ నియోజకవర్గంలోని కరోనా పేషేంట్లకు మందులు పంపిణీ చేశారు. కరోనా ఉన్నంతకాలం పేషేంట్లకు ఉత్తమ చికిత్స అందిస్తామని హామీ ఇచ్చాడు బాలయ్య. అలాగే రోగుల శ్రేయస్సుకోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులతో మాట్లాడారట. ఈ విధంగా బాలయ్య మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడని ఫ్యాన్స్, నేటిజన్లు కొనియాడుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బోయపాటితో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాను మిర్యాలరవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.