టాలీవుడ్లో గత పది రోజులుగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ‘గూఢచారి’. ఆగస్టు 3న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని.. అంచనాల్ని మించిన వసూళ్లతో దూసుకెళ్తోంది. రెండో వారంలోనూ సత్తా చాటుకుంటూ రూ.10 కోట్ల షేర్ మార్కును అందుకుందీ సినిమా. రూ.6 కోట్ల స్వల్ప బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం రెట్టింపు వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర మార్గాల్లోనూ ఈ చిత్రం భారీగానే ఆదాయం తెచ్చిపెట్టింది. ఇంత సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ తీయాలని చిత్ర బృందం భావిస్తోంది. ‘గూఢచారి’కి సీక్వెల్ ఉంటుందని విడుదలకు ముందే ప్రకటించాడు శేష్. సినిమా అంచనాల్ని మించి విజయం సాధించడంతో శేష్ అండ్ కో మరింత ఉత్సాహంగా సీక్వెల్ దిశగా అడుగులు వేస్తోంది.
‘గూఢచారి’కి కేవలం ఒక సీక్వెల్ కాదని.. రెండు ఉంటాయని దర్శకుడు శశికిరణ్ తిక్క ప్రకటించాడు. ఆల్రెడీ తాను.. శేష్ సీక్వెల్స్ గురించి చర్చించామని.. ప్రస్తుతం ఐడియాలుు షేర్ చేసుకుంటున్నామని తెలిపాడు. ‘గూఢచారి’ తొలి సీక్వెల్ త్వరలోనే మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తామన్నాడు. టాలీవుడ్లో ఒక సిరీస్ లో సినిమాలు రావడం అరుదు. ఇక్కడ సీక్వెల్స్ వర్కువటైన దాఖలాలు కూడా తక్కువే. కానీ ‘గూఢచారి’కి ఆ స్కోప్ బాగా ఉంది. పకడ్బందీగా తీస్తే కనీసం రెండు సీక్వెల్స్ వర్కువటయ్యే అవకాశాలున్నాయి. ఈ కథకు ఆ పరిధి ఉంది కూడా. తొలి భాగంలో హీరో ఛేదించింది పర్సనల్ టాస్కే. అతడికి ఇంకా పెద్ద స్థాయి టాస్కులిచ్చి తర్వాతి భాగాల్ని ఆసక్తికరంగా నడిపించవచ్చు. ‘గూఢచారి’ పెద్ద హిట్టయిన నేపథ్యంలో తర్వాతి భాగాల్ని ఎక్కువ బడ్జెట్ లో మరింత హై స్టాండర్డ్స్ లో తీయడానికి అవకాశముంది.