కరోనా వల్ల ఎన్నో సినిమాలు వాయిదాలు పడ్డాయి. మొన్నటికి మొన్న కరోనా థర్డ్ వేవ్ వల్ల పదుల సంఖ్యలో సినిమాల విడుదల తేదీలు గందరగోళం అయ్యాయి. థర్డ్ వేవ్ ప్రభావం తగ్గడమే ఆలస్యం వెంటనే పెద్ద సినిమాల నుండి మొదలుకుని చిన్న సినిమాల వరకు డేట్లను ప్రకటించాయి.
భీమ్లా నాయక్ తో హడావుడి మొదలు అయ్యింది. ఈ సమ్మర్ మొత్తం భారీ నుండి అతి భారీ సినిమాలు చాలానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇంత హడావుడిలో పలు సినిమాల విడుదల తేదీలు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి. కొన్ని సినిమాలు రెండు విడుదల తేదీలను ప్రకటించి గందరగోళంకు గురి చేస్తున్నాయి. రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో చాలా చర్చ జరుగుతోంది.
ఆ రెండు సినిమాల్లో ఒకటి మాస్ రాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ కాగా రెండవ సినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని. ఈ రెండు సినిమాల విడుదల తేదీలు ఇంకా క్లారిటీ రాలేదు.
గని సినిమాను ఈనెల 25వ తారీకునే విడుదల చేయాలనుకున్నారు. కాని భీమ్లా నాయక్ ఆ తేదీకి ముందుగా అనుకున్నట్లుగా వచ్చేసింది. భీమ్లా నాయక్ రాకుంటే వస్తానంటూ చెప్పుకొచ్చిన గని ఇప్పుడు కొత్త డేట్ ను వెతుక్కోవాల్సి వచ్చింది.
కొత్త విడుదల తేదీ కోసం గని మేకర్స్ బూతద్దం పెట్టి మరీ వెతకాల్సి వస్తుంది. ఈసమ్మర్ లో వారికి సరైన డేట్ కనిపించడం లేడట. ఒక వేళ సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటే రిస్క్ చేయాల్సి వస్తుంది.
ఇక మాస్ రాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సమ్మర్ లో ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. కాని ఆ సినిమాకు కూడా విడుదల తేదీ సమస్యగా మారింది. మొన్నటి వరకు మార్చి 25వ తారీకున ఆర్ ఆర్ ఆర్ విడుదల కాకుంటే విడుదల చేస్తామన్నారు. ఒక వేళ ఆ తేదీకి ఆర్ ఆర్ ఆర్ వస్తే ఏప్రిల్ 15న విడుదల చేస్తామని ప్రకటించారు.
ఏప్రిల్ 14వ తారీకున కేజీఎఫ్ ఉండటం వల్ల ఖచ్చితంగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు నష్టం తప్పదని అంటున్నారు. అందుకే ఒక వారం ముందుగానే విడుదల చేయడం మంచిదనే ఉద్దేశ్యంతో ఉన్నారు.
గని సినిమాను కూడా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలకు విడుదల తేదీలు లేకపోవడంతో ఒకే డేట్ పై కన్నేశాయి. అయితే ఆ డేట్ లో ఆర్ ఆర్ ఆర్ సందడి కొనసాగుతూ ఉంటుంది.
ఆర్ ఆర్ ఆర్ విడుదల అయిన వారం రోజులకే ఈ రెండు సినిమాలు విడుదల అవ్వడం అంటే చాలా పెద్ద రిస్క్. జక్కన్న సినిమాకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వకుండా వస్తే ఇంకా ఏమైనా ఉందా అంటూ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొరివితో తల.. అన్న సామెత గుర్తు చేస్తున్నారు. ఆలస్యం చేస్తే కేజీఎఫ్ తో నష్టం.. ముందు వస్తే ఆర్ ఆర్ ఆర్ తో నష్టం. కనుక ఈ రెండు సినిమాలకు సమ్మర్ లో సరైన తేదీనే విడుదలకు లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. రిస్క్ చేస్తారా.. సాఫీగా సేఫ్ జోన్ లో వీరిద్దరు వస్తారా అనేది చూడాలి.