మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. భీకరుడిగా అతడి మేకోవర్ సర్ ప్రైజ్ చేయనుంది. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకుడు. దబాంగ్ 3 బ్యూటీ సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఉపేంద్ర- సునీల్ శెట్టి- నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజా సమాచారం మేరకు.. గని సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. సాధ్యమైనంత తొందర్లోనే ఈ మూవీని విడుదల చేసేందుకు ఆస్కారం ఉంది. ఇంతకుముందు మేకర్స్ రెండు విడుదల తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. అయితే మార్చి- ఏప్రిల్ లో కరోనా థర్డ్ వేవ్ పరిస్థితి ఎలా ఉంటుందో ముందే ఊహించలేం. అందువల్ల సాధ్యమైనంత తొందరగానే ఈ మూవీ రిలీజయ్యే ఆస్కారం ఉందని టాక్ వినిపిస్తోంది.
``ఇతర చిత్రాల విడుదల షెడ్యూల్ ని బట్టి మా తేదీని నిర్ణయిస్తాం. అన్ని చిత్రాలు మంచిగా విడువలవ్వాలని కోరుకుంటున్నాము. అతి త్వరలో థియేటర్లలో కలుద్దాం`` అని గని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్నివేశాన్ని బట్టి రెండిటిలో ఏదో ఒక రిలీజ్ తేదీని ఖాయం చేస్తారు. ఇక ఈ చిత్రానికి అబ్బూరి రవి కథను అందించారు. స్టంట్స్ ని దిలీప్ సుబ్బరాయన్ .. లార్నెల్ స్టోవాల్ కంపోజ్ చేశారు.