సాహో కోసం ఆ సంగీత దర్శకుడా?

Update: 2019-05-28 05:43 GMT
నిన్న సాహో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన శంకర్ ఎహసాన్ లాయ్ లు పెను సంచలనం రేపారు. విడుదల ఇంకో 80 రోజుల్లో ఉందనంగా రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాకు ఇది ఊహించని పరిణామమే. అయితే తెరవెనుక ఏదో జరిగిందనడంలో మాత్రం సందేహం అక్కర్లేదు. కీలకమైన సమయంలో ఇలా హ్యాండ్ ఇవ్వడం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు అర్జెంటుగా సాహోకి రీ ప్లేస్మెంట్ చేయాలి.

తాజా అప్ డేట్ ప్రకారం తమిళ సంగీత సంచలనం జీబ్రాన్ ను తీసుకోబోతున్నట్టు తెలిసింది. అఫీషియల్ గా ఇంకా బయటికి రాలేదు కానీ ఆల్మోస్ట్ ఓకే అయినట్టు చెబుతున్నారు. దర్శకుడు సుజిత్ కు జీబ్రాన్ కు అనుబంధం ఇప్పటిది కాదు. సుజిత్ ప్రభాస్ దృష్టిలో పడేంత రేంజ్ లో హిట్ అయిన రన్ రాజా రన్ కి హిట్ మ్యూజిక్ ఇచ్చింది ఇతనే. బుజ్జిమా అనే పాట ఆ టైంలో హోరెత్తిపోయింది

సో సుజిత్ ఒకవేళ ఎంచుకోవాల్సి వస్తే జీబ్రాన్ కే ఓటు వేయొచ్చు. థమన్ పేరు పరిశీలనలో ఉందన్నారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ తగ్గిందట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తనదైన ప్రత్యేకత చూపించే జీబ్రాన్ గత ఏడాది రట్ససన్ కు ఇచ్చిన స్కోర్ మతులు పోగొట్టింది. ఓ మాములు సైకో థ్రిల్లర్ ని బీజీఎమ్ ద్వారా ఏ స్థాయిలో ఎలివేట్ చేయొచ్చో అందులో చూడొచ్చు. అలాంటిది ఇంత భారీ కాన్వాస్ ఉన్న మూవీ ఇస్తే ఇక ఎలా రెచ్చిపోతాడో వేరే చెప్పాలా. కమల్ హాసన్ అంతటి హీరోనే ఇళయరాజా తర్వాత తాను అభిమానించే వ్యక్తిగా మెప్పు పొందిన జీబ్రాన్ ఓకే అయితే సాహోకు మంచి వెయిటేజ్ వచ్చినట్టే


Tags:    

Similar News