'గాడ్ ఫాదర్' ట్రైలర్: మోస్ట్ డేంజర్ అండ్ మిస్టీరియస్ మ్యాన్ గా మెగాస్టార్..!

Update: 2022-09-28 15:06 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన ''గాడ్‌ ఫాద‌ర్‌'' సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దసరా సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ కోసం కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - రెండు పాటలు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ దూకుడుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అనంతపురంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.

ఈ సందర్భంగా 'గాడ్ ఫాదర్'థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. 'మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం.. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక.. అన్నీ రంగులు మారతాయి..' అని పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మరణిస్తే.. రాష్ట్రంలోని రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ ట్రైలర్ చూపించారు. సీఎం కుర్చీ కోసం ఎలాంటి ఆట ఎవరెవరు పావులు కదుపుతున్నారు.. వాటిని బ్రహ్మ (చిరంజీవి) ఎలా అడ్డుకున్నారు అనేది 'గాడ్ ఫాదర్' కథాంశమని తెలుస్తోంది.

ఇందులో మోస్ట్ డేంజర్ అండ్ మిస్టీరియస్ మ్యాన్ గా పవర్ ఫుల్ రోల్ లో చిరంజీవి ని పరిచయం చేసారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెగాస్టార్ స్టైలిష్ గా చాలా కొత్తగా కనిపించాడు. 'నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు' 'నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను' అంటూ చిరు తనదైన శైలిలో పలికిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో నయనతార కీలక పాత్రలో కనిపించగా.. సత్యదేవ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు. బ్రహ్మ వెనుక మా పార్టీ లేదు అని నయన్ చెప్పడం.. చిరంజీవి ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం.. పోలీసులపై తిరగబడటం.. ఖైదీ డ్రెస్సులో ఫైట్ చేయడం వంటివి ట్రైలర్ లో ఆసక్తికరంగా ఉన్నాయి.

చిరంజీవి ని అనుసరించే వ్యక్తిగా.. అవసరంలో ఉన్నప్పుడు వెంటనే వాలిపోయే షార్ఫ్ షూటర్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కనిపించాడు. కండలవీరుడు ఎప్పటిలాగే తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకర్షించాడు. ఇక్కడ హిందీలోనే డైలాగ్స్ పలకడం గమనార్హం.

ట్రైలర్ చివర్లో చిరు ఇంట్రెన్స్ గా నడుచుకుంటూ వస్తుండగా.. సల్మాన్ అడ్డొచ్చిన రౌడీలను ఊచకోత కొస్తూ కనిపించాడు. అలానే ఇద్దరూ మెషిన్ గన్స్ తీసుకొని ఫైరింగ్ చేయడాన్ని మనం చూడొచ్చు. ఇక ఈ సినిమాలో సునీల్ - సముద్ర ఖని - బ్రహ్మాజీ - మురళీ శర్మ - ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా ''గాడ్ ఫాదర్'' తెరకెక్కిన సంగతి తెలిసిందే. దర్శకు6మోహన్ రాజా మాతృకలో ఉన్న మెయిన్ ప్లాట్ ని తీసుకొని.. తెలుగులో మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ తో కూడిన పొలిటికల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.

ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు నీరవ్ షా కెమెరా పనితనం దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సురేష్ సెల్వరాజన్ దీనికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మొత్తం మీద 'గాడ్ ఫాదర్' ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కి విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు.. ఆసక్తిని రెట్టింపు చేసిందని చెప్పాలి.

శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్స్ పై ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలుగు హిందీ భాషల్లో విజయదశమి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News