ఫ్రైడే రిలీజ్.. పాంచ్ కా ప‌టాకా!

Update: 2019-05-28 01:30 GMT
ఈ శుక్ర‌వారం ఏకంగా ఐదు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ఫ్రైడే రిలీజెస్ లో పార్టీ చేసుకునేంత‌ భారీ సినిమాలేవీ రిలీజ్ కావ‌డం లేదు. మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌ళ్లీ అగ్ర క‌థానాయ‌కుడి సినిమా ఏదీ లేదు. సూర్య‌-ఎన్జీకేకి తెలుగులో బ‌జ్ అంతంత మాత్ర‌మే. అయితే ఉన్న వాటిలో హాలీవుడ్ మూవీ గాడ్జిల్లాకు మాత్రం మెట్రో న‌గ‌రాల్లో విప‌రీత‌మైన క్రేజు నెల‌కొంది. ఇటీవ‌లే రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన మార్వ‌ల్ - అవెంజ‌ర్స్ 4 .. గేమ్ ఆఫ్ థ్రోన్స్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ సినిమా గురించే జ‌నం ఎక్కువ‌గా ముచ్చ‌టించుకుంటున్నారు.

ఎన్‌ జీకే- సువ‌ర్ణ సుంద‌రి- ఫ‌ల‌క్ నుమా దాస్- అభినేత్రి 2- గాడ్జిల్లా:  కింగ్ ఆఫ్ ది మాన్‌స్ట‌ర్స్ చిత్రాలు .. ఈనెల 31న రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఒకేరోజు ఐదు చిత్రాల మ‌ధ్య పోటీ నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే చిన్న సినిమాల‌కు థియేట‌ర్ల స‌మ‌స్యపై చ‌ర్చ మొద‌లైంది. ఉన్న వాటిలో సూర్య - సెల్వ రాఘ‌వ‌న్ మూవీ `ఎన్ జీకే`కి థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్త‌కుండా కె.కె.రాధామోహ‌న్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఎన్‌జీకే ట్రైల‌ర్ ఫ‌ర్వాలేద‌నిపించింది. సూర్య ఈసారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తో వ‌స్తుండ‌డంతో ఆస‌క్తి నెల‌కొంది. అలాగే చిన్న సినిమాగా వ‌స్తున్నా `ఫ‌ల‌క్ నుమా దాస్` పైనా ఓ మోస్త‌రు అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. హైద‌రాబాద్ ఫ‌ల‌క్ నుమాలో జీవితాల్ని క‌ళ్ల‌కు గ‌డుతూ తీసిన ఈ సినిమా ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. సోమ‌వారం సాయంత్రం నాని- రానా లాంటి స్టార్లు హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న‌ ప్రీరిలీజ్ వేడుక‌కు ఎటెండ‌వుతుండ‌డంతో ఈ మూవీ పైనా ఆస‌క్తి రేకెత్తింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రానికి బ్యాక‌ప్ ఉండ‌డంతో థియేట‌ర్ల ప‌రంగా స‌మ‌స్య లేదు. మ‌రోవైపు ప్ర‌భుదేవా- త‌మ‌న్నా కాంబినేష‌న్ మూవీ అభినేత్రి పై అంచ‌నాలేవీ లేక‌పోయినా మిల్కీ వైట్ బ్యూటీ గ్లామ‌ర్ షో గురించి జ‌నం అంతో ఇంతో మాట్లాడుకుంటున్నారు. అలాగే జ‌య‌ప్ర‌ద‌- పూర్ణ‌- సాక్షిచౌద‌రి తారాగ‌ణంగా తెర‌కెక్కించిన సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ `సువ‌ర్ణ సుంద‌రి` వీటితో పాటే బ‌రిలో దిగుతోంది. ఇందులో ఫ‌ల‌క్ నుమా దాస్ - సువ‌ర్ణ సుంద‌రి స్ట్రెయిట్ సినిమాలు. మిగ‌తా మూడూ డ‌బ్బింగ్ సినిమాలు.

ఇక వీటితో పాటే `గాడ్జిల్లా 2` బ‌రిలో దిగుతోంది. ఈ హాలీవుడ్ అనువాద చిత్రాన్ని తెలుగు- త‌మిళం- హిందీ- ఇంగ్లీష్ వెర్ష‌న్ల‌ను రియ‌ల్ 3డి- ఐమ్యాక్స్ 3డిలో రిలీజ్ చేస్తుండ‌డంతో ఆ మేర‌కు మ‌ల్టీప్లెక్సుల్లో విప‌రీత‌మైన క్రేజు నెల‌కొంది. హాలీవుడ్ ప్రియులు ఈ భారీ చిత్రం కోసం వెయ్యి క‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని భారీ వీఎఫ్ఎక్స్ తో తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. అలాగే ఇటీవ‌ల హాలీవుడ్ సినిమాల‌తో చిక్కులొస్తున్నాయ‌ని ట్రేడ్ లో విశ్లేష‌ణ సాగుతోంది. అవి వ‌స్తున్నాయంటే .. మ‌న‌ మ‌ల్టీప్లెక్సుల్లో వాటికే విప‌రీత‌మైన క్రేజు నెల‌కొంటోంది. వాటి ముందు చిన్న సినిమాలు క‌న‌బ‌డ‌డం లేదు. ఆ మేర‌కు చిన్న వాటికి థియేట‌ర్ల కోత ప‌డుతోంది. మొన్న అవెంజ‌ర్స్ - ది ఎండ్ గేమ్ రిలీజ్ టైమ్ లో వ‌చ్చిన‌ట్టే ఈసారి కూడా థియేట‌ర్ల కొర‌త ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సువ‌ర్ణ సుంద‌రి నిర్మాత‌లు అప్పుడే థియేట‌ర్ల కొర‌త అని బ‌హిరంగంగా వాపోయిన సంగ‌తిని గుర్తు చేసుకోవాలి. ఇక గాడ్జిల్లా ట్రైల‌ర్ కి అద్భుత‌మైన క్రేజు వ‌చ్చింది కాబ‌ట్టి మ‌ల్టీప్లెక్సుల్లో ఈ సినిమాకే గిరాకీ ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.


Full View


Tags:    

Similar News