భారీ కలెక్షన్లతో దూసుకెళుతున్న బాహుబలి 2 మూవీకి.. వివాదాలు సైతం భారీగా వెంటాడుతున్నాయి. విడుదలకు ముందు నుంచి పలు వివాదాలు బాహుబలి టీంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బాహుబలి 2 మూవీ విడుదలకు ముందు కన్నడ సంఘాలు ఈ సినిమా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కావేరీ వివాదం సందర్భంలో కట్టప్ప పాత్రధారి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని.. లేదంటే బాహుబలి 2 విడుదలను అడ్డుకుంటామన్నారు.
ఈ ఇష్యూ మీద స్పందించిన రాజమౌళి.. ఈ వివాదాన్ని పెద్దది చేయొద్దని.. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటే.. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లి వేలాది కుటుంబాల మీద ప్రభావితం చూపుతాయని చెప్పిన వైనంతోఈ ఇష్యూ సమిసిపోయింది. అంతలోనే.. ఈ సినిమాకు అదనపు షోలు ఇస్తూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం.. కాంబోల పేరుతో ప్రేక్షకుల్ని దోపీడి చేస్తున్నారన్న విమర్శలు బాహుబలి 2ను వెంటాడాయి.
ఇది సరిపోదన్నట్లుగా మరో వివాదం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో తమను కించపరిచేలా మాటలు ఉన్నాయంటూ అరికటిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని సెన్సార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన అరెకటిక సంఘాలు.. తాజా చిత్రంలో తమ కులాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ కులాన్ని కించపరిచేలా కటిక చీకటి అనే పదాన్ని వాడారని.. ఆ పదం అరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ఉందని సంఘ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా సినిమాలో ఉన్న పదాన్ని వెంటనే తొలగించాలని.. లేదంటే చిత్ర దర్శకుడు రాజమౌళి ఇంటిని ముట్టడిస్తున్నామన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/